UPI Transactions : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. క్యాష్ వెంట పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఫిజికల్ మనీ క్యారియింగ్ తగ్గిపోవడంతో వివిధ రకాల సంస్థలు యూపీఐ పేమెంట్స్ ఇంటిగ్రేషన్ ను తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదు.
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. క్యాష్ వెంట పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఫిజికల్ మనీ క్యారియింగ్ తగ్గిపోవడంతో వివిధ రకాల సంస్థలు యూపీఐ పేమెంట్స్ ఇంటిగ్రేషన్ ను తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కు ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదు. ఏప్రిల్ 1వ తేదీ నుండి యూపీఐ ట్రాన్సాక్షన్లో మార్పులు రాబోతున్నాయి. 1 శాతానికిపైగా ఇంటర్చేంజ్ ఫీజులను వసూలు చేయబోతున్నారు.
తాజా సర్క్యులర్ ప్రకారం రూ. 2000, ఆపై లావాదేవీలకు గాను 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజులు వసూలు చేయనున్నారు. పెద్ద వ్యాపారులతో పాటు చిరు వ్యాపారులకు 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజులు వసూలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పేమెంట్ ప్రాసెసింగ్ ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాలను వసూలు చేయనున్నారు.
వినియోగదారులు వినియోగించే కార్డుల ఆధారంగా ఈ చార్జీలు వసూలు చేయనున్నారు. ఏప్రిల్ 1 వ తేదీ నుండి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. యూపీఐ పేమెంట్స్ భారం కానుండటంతో చిరువ్యాపారులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని, యూపీఐ చార్జీలు కూడా పెరిగితే మరింత ఇబ్బందులు వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.