రామ్ చరణ్ నటించిన “గేమ్ చేంజర్” చిత్రం, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది, ఇది అభిమానులలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్.
కొన్ని నెలల క్రితం, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని డిసెంబర్ 2024లో విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు, కానీ స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. కానీ, మంగళవారం సంగీత దర్శకుడు థమన్ తన X (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. “డిసెంబర్ 20 వరకు, ‘గేమ్ చేంజర్’ ప్రొమోషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి” అని ఆయన చెప్పారు.
ఈ ప్రకటనతో, మెగా ఫాన్స్, రామ్ చరణ్ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే థమన్ తొందరలో విడుదల తేదీని ప్రయతించినట్టు కనిపించింది. మరోపక్క “పుష్ప” సినిమా డిసెంబర్ 6న విడుదల కానుందని, దీంతో రెండు మెగా సినిమాలు కేవలం రెండు వారాల గ్యాప్లో విడుదల అవుతున్నాయి.
పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హైప్ ఉన్న సినిమా. సీక్వెల్ సినిమాకు బాలీవుడ్ లో క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుందనే విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో ఇప్పటికే రిలీజ్ అయినా రెండు పాటలు., టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప ప్రమోషన్స్ ను తట్టుకుని గేమ్ చేంజర్ ఎలా నిలబడుతుందో చూడాలి