»This Is The Clarity On The Release Of Game Changer
Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడంటే!?
స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ విషయంలో డైలమాలో పడిపోయింది చిత్ర యూనిట్. ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లాక్ చేయలేదు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ డేట్ లాక్ చేసే పనిలో ఉన్నాయి. కానీ ఆర్సీ 15నే ఈ విషయంలో వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు దానిపైనే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ మూవీని దసరాకు తీసుకొద్దామనుకుంటే.. అప్పటి వరకు సినిమా కంప్లీట్ అవుతుందా.. అయినా బాలయ్య, రవితేజ, రామ్-బోయపాటి ఇప్పటికే డేట్స్ లాక్ చేసుకున్నారు కాబట్టి కష్టమే. పోని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే.. ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ 28 రేసులో ఉన్నాయి. అలాగని సమ్మర్‌కు వెళ్తే.. మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ టీమ్ రిలీజ్ డేట్ పై కాస్త గట్టిగానే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ గుడ్ న్యూస్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం శంకర్, గేమ్ ఛేంజర్‌తో పాటు ఇండియన్ 2 కూడా తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్లో చరణ్ మూవీ రిలీజ్ చేసి.. సమ్మర్లో ఇండియన్ 2 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట శంకర్. త్వరలోనే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక శంకర్ ఈ సినిమాను పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. తండ్రి కొడుకులుగా చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు మెగా పవర్ స్టార్. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ సినిమాతో శంకర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.