»Telecom Department To Close More Six Million Mobile Connections Related With Fraudulent
Fraud Mobile Connection:సైబర్ కేటుగాళ్లపై టెలికాం శాఖ కొరడా.. 50 లక్షల నకిలీ మొబైల్ కనెక్షన్లు కట్
సైబర్ మోసాలను అరికట్టేందుకు మొబైల్ ఫోన్ కనెక్షన్ల విషయంలో టెలికాం శాఖ కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా టెలికాం శాఖ ఇప్పటివరకు 1.14 కోట్ల క్రియాశీల మొబైల్ ఫోన్ కనెక్షన్లను పరీక్షించింది.
Fraud Mobile Connection:అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాపై ప్రభుత్వం అనేక స్థాయిల్లో చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్, హోం మంత్రిత్వ శాఖ, బ్యాంకులు, టెలికాం శాఖ కలిసి పనిచేస్తున్నాయి. సైబర్ మోసాలను అరికట్టేందుకు మొబైల్ ఫోన్ కనెక్షన్ల విషయంలో టెలికాం శాఖ కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా టెలికాం శాఖ ఇప్పటివరకు 1.14 కోట్ల క్రియాశీల మొబైల్ ఫోన్ కనెక్షన్లను పరీక్షించింది. వీటిలో దాదాపు 60 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లు మోసపూరితమైనవిగా గుర్తించారు. టెలికాం శాఖ ఇప్పటికే వీటిలో దాదాపు 50 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్లను మూసివేసింది. ఇప్పుడు మిగిలిన కనెక్షన్లను కూడా త్వరలోనే మూసివేస్తోంది.
సైబర్ దుండగుల ముఠాకు మోసపూరిత మొబైల్ కనెక్షన్లు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. సైబర్ మోసాలకు సంబంధించిన దాదాపు అన్ని కేసులు ఇలాంటి మొబైల్ కనెక్షన్ల ద్వారానే జరుగుతాయి. ఈ మోసపూరిత మొబైల్ కనెక్షన్లను నిలిపివేస్తే సైబర్ మోసాలను అరికట్టడంలో పెద్ద విజయం సాధించవచ్చు. సైబర్ క్రైమ్‌లను అరికట్టేందుకు అందులో యాక్టివ్‌గా ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు టెలికం శాఖ సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ఇందుకోసం పలు ప్రభుత్వ, స్వయం ప్రతిపత్తి కలిగిన శాఖలు కలిసి బహుళస్థాయి వ్యూహంతో పనిచేస్తున్నాయి. మోసపూరిత మొబైల్ నంబర్లతో అనుసంధానించబడిన 7 లక్షలకు పైగా ఖాతాలను ఇప్పటివరకు స్తంభింపజేసినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వాటిలో బ్యాంక్ ఖాతా, పేటీఎం ఖాతా, ఫోన్ పే ఖాతా మొదలైనవి ఉన్నాయి. మోసపోయిన బాధితుల నుంచి డబ్బులు రాబట్టేందుకు ఈ ఖాతాలను వినియోగించుకుంటున్నారని తెలిపారు.