»Telangana Assembly Elections In 2023 Central Election Team Stay For Three Days In Telangana
Assembly Elections: డిసెంబర్7వ తేదీలోపే అసెంబ్లీ ఎన్నికలు
వరుసగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంటులు, ఇతర ముఖ్య అధికారులతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం చర్చలు జరుపుతోంది. ఎలాగైనా తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
Assembly Elections: భారత ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఇటీవలే మూడు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతపై ఈసీ బృందం విస్తృతంగా సమాలోచనలు చేస్తుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలో ఈ బృందం హైదరాబాద్ కు చేరుకుంది. బృందంలో పలువురు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, అండర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి త్వరలో ముగియనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధత పై ఈ బృందం విస్తృతంగా చర్చిస్తోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఈసీ బృందం సూచించింది. దీంతో ఇంకో ఐదు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుపుతామని ఈసీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. గత ఎన్నికల కంటే ముందే అనగా డిసెంబర్7 లోపే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
వరుసగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంటులు, ఇతర ముఖ్య అధికారులతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం చర్చలు జరుపుతోంది. ఎలాగైనా తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం నవంబర్ లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసీ కొత్తగా తీసుకువచ్చిన టెక్నాలజీ అప్లికేషన్లు ఎలా వాడాలో వారికి అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చింది. ఈనెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ ఇచ్చింది. ఓటర్ల నమోదు మొదలుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రాసెస్ పై శిక్షణ ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో మూడు సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్న అధికారుల బదిలీలపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. జులై 31 లోపు ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లుగా సమాచారం. ఆపై నవంబర్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.