కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. ఇంతలో సీఎం పదవీపై చర్చ వచ్చింది. తన తండ్రి, సిద్ధరామయ్య సీఎం పదవీకి అర్హుడు అని కుమారుడు యతీంద్ర కామెంట్స్ చేశారు.
Siddaramaiah Is The Best Option To CM Post:Yatindra
Karnataka:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. 120 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులు అందరూ బెంగళూరు రావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీచేసింది.
కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండగా.. మెజార్టీ సాధించాల్సి ఉంది. ఇంతలో సీఎం అభ్యర్థిపై (cm candidate) చర్చ జరుగుతుంది. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తన తండ్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సీఎం కావాలని కుమారుడు యతీంద్ర అన్నారు. ఈ సారి సొంతంగానే కాంగ్రెస్ అధికారం చేపడుతుందని పేర్కొన్నారు.
బీజేపీ హయాంలో జరిగిన అవినీతిని సరిచేసే సత్తా తన తండ్రికి మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో తన తండ్రికి ప్రత్యామ్నాయం మరొకరు లేరని తెలిపారు. కన్నడ పౌరుడిగా.. కుమారుడిగా సిద్దరామయ్య (Siddaramaiah) సీఎం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. గతంలో ఆయన సుపరిపాలన అందించారని పేర్కొన్నారు. ఈ సారి కూడా రాష్ట్రాన్ని చక్కగా పాలిస్తారని తెలిపారు.
సీఎం రేసులో ఈ సారి డీకే శివకుమార్ (DK Shivakumar) కూడా ఉన్నారు. ఆయన ట్రబుల్ షూటర్‌గా పేరు పొందారు. ఎన్నికలకు ముందే సీఎం పదవీపై చర్చ జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి పోస్ట్‌పై కామెంట్స్ వద్దని చెప్పడంతో.. అప్పుడు సిద్ధరామయ్య(Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shivakumar) గమ్మున ఉన్నారు. ఇప్పుడు విజయం సాధించడంతో.. సీఎం పదవీ ఎవరికీ ఇవ్వాలనే అంశంపై సస్పెన్ష్ కొనసాగుతోంది.