SBI Recruitment : బ్యాంక్ జాబ్స్‌కి ట్రై చేస్తున్నారా?.. రాత పరీక్ష లేకుండానే ఎస్బీఐలో ఉద్యోగాలు
బ్యాంక్ జాబ్స్ అనేది చాలామంది కల. కానీ.. చాలామందికి అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. బ్యాంక్ జాబ్స్ లో చేరడం అనేది అంత ఈజీ కాదు. జాబ్ కొట్టాలంటే చాలా కష్టపడాలి. అందుకే.. జాబ్స్ కోసం ట్రై చేసి విసిగిపోతారు కొందరు. చాలా ఏళ్లు కష్టపడ్డా కూడా ఒక్కోసారి ఫలితం దక్కదు
SBI Recruitment : బ్యాంక్ జాబ్స్ అనేది చాలామంది కల. కానీ.. చాలామందికి అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. బ్యాంక్ జాబ్స్ లో చేరడం అనేది అంత ఈజీ కాదు. జాబ్ కొట్టాలంటే చాలా కష్టపడాలి. అందుకే.. జాబ్స్ కోసం ట్రై చేసి విసిగిపోతారు కొందరు. చాలా ఏళ్లు కష్టపడ్డా కూడా ఒక్కోసారి ఫలితం దక్కదు. కానీ.. నిరంతర కృషి చేస్తే బ్యాంక్ జాబ్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో పని చేయాలనేది చాలామంది కల. అలాంటి నిరుద్యోగులకు తాజాగా ఎస్బీఐ తీపి కబురు చెప్పింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మామూలుగా బ్యాంక్ జాబ్ అంటే రాత పరీక్ష ఉంటుంది. కానీ.. ఈ జాబ్ కు రాత పరీక్ష లేదు. నేరుగా పోస్టులను భర్తీ చేస్తారు. రెండు కేటగిరీలలో జాబ్స్ ను భర్తీ చేస్తారు. రిటైల్ ప్రొడక్ట్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అనే పోస్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మార్చి 15 వరకు ఆన్ లైన్ లో ఎస్బీఐ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI Recruitment : విద్యార్హత ఏంటి?
ఈ పోస్టులకు విద్యార్హత ఏంటంటే.. రిటైల్ ప్రొడక్ట్స్ మేనేజర్ పోస్ట్ కోసం ఎంబీఏ మార్కెటింగ్ చేసి.. అందులో పీజీడీఏం చేసి ఉండాలి. అలాగే.. మార్కెటింగ్ అనుభవం ఉండాలి. ఇక.. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టుకు పీజీ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 నుంచి 55 సంవత్సరాలు మధ్య ఉండాలి. సంబంధిత రంగంలో విద్యార్హత, అనుభవం ఉన్న వాళ్లను షార్ట్ లిస్ట్ చేసి ఇంటరాక్షన్ రౌండ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు కలకత్తాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. రిటైల్ మేనేజర్ గా 5 ఖాళీలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఎస్బీఐ బ్యాంక్ వెబ్ సైట్ లోకి వెళ్లి వెంటనే అప్లయి చేసుకోండి.