MIM : ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఎంఐఎం పార్టీ పై సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీలో భారీ ఎత్తున నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూడడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ స్కామ్ లో ఎంఐఎం పార్టీ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఎంఐఎం పార్టీ పై సంచలన ఆరోపణలు చేశారు. జీహెచ్ఎంసీలో భారీ ఎత్తున నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూడడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ స్కామ్ లో ఎంఐఎం పార్టీ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఓల్డ్ సిటీలోనే ఎక్కువగా బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఇందులో టెర్రరిస్టులు కూడా ఉండొచ్చన్న అనుమానాలు రాజాసింగ్ వ్యక్తం చేశారు.ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. 27 వేల బర్త్ సర్టిఫికెట్లు అన్ని ఓల్డ్ సిటీ పరిధిలోనే ఉన్నాయని వీటిని ఎంఐఎం నేతలు దగ్గరుండి ప్రోత్సహించారని ఆరోపించారు.
ఈ సర్టిఫికెట్స్ పొందిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కి చెందిన వారు ఉన్నారు. అసలు టెర్రిరిస్టులు ఎందరు ఉన్నారో నిగ్గు తేల్చాలని అన్నారు. ఇందుకోసం సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా అసలు ఎన్ని ఓటర్, రేషన్ కార్డులు ఉన్నాయో కూడా లెక్క తేల్చాలన్నారు.