హైదరాబాద్ (Hyderabad) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదంలో చిక్కున్నారు. ఆయన పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో(Shobhayatra) ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ షాహినాత్ గంజ్ పోలీసులు రాజా సింగ్ పై ఈ కేసు నమోదు చేశారు.శోభాయాత్రలో రాజా సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్‌ఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.
ఏపీ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటి రామారావు(KTR) ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ(letter) రాసి డిమాండ్ చేశారు. పలు కార్పొరేట్లకు రూ. 12.5 లక్షల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరించడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని కేసీఆర్ చేసిన కామెంట్లపై రేవంత్ రెడ్డి స్పందించారు. పచ్చి అబద్దాన్ని కూడా నిజం అనిపించేలా చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరన్నారు.
ఓ వృద్ధుడికి ఇద్దరు పోలీసులు(police) సహాయం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పప్పును పోలీసులు ఓపికతో సేకరించి సంచిలోకి ఎత్తారు. ఇది చూసిన నెటిజన్లు వారు చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో(Tirupati District) కలకలం సృష్టిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) నాగరాజు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమ్ముడు వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు. మహిళ తరుపున బంధువులు అన్నను దారుణంగా హత్య చేశారు.తమ్ముడి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు (Police) ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ (Gadwal District Collector), జెడ్పీ సీఈఓ మధ్య వివాదం ముదిరింది. కలెక్టర్ వల్లూరి క్రాంతి (Collector Valloori Kranti) తనను రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని జెడ్పీ సీఈఓ విజయనాయక్ (Vijayanaik is the CEO of ZP) ఆరోపించారు. తనను కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి(Minister Niranjan Reddy) ఫోన్ చేసి తన గోడ...
బీహార్(Bihar)లోని నలంద, షరీఫ్‌లోని రెండు మూడు చోట్ల శనివారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని బీహార్ పోలీసులు చెప్పారు.
పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో(Surat Sessions Court) అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ (Lok Sabha) సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీ...
తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 8న ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి తిరుపతికి వయా...
మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొనబోతుంది. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు వేసింది.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు.