Vijayanaik : గద్వాల్ కలెక్టర్‌తో జడ్పీ సీఈవో వివాదం
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ (Gadwal District Collector), జెడ్పీ సీఈఓ మధ్య వివాదం ముదిరింది. కలెక్టర్ వల్లూరి క్రాంతి (Collector Valloori Kranti) తనను రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని జెడ్పీ సీఈఓ విజయనాయక్ (Vijayanaik is the CEO of ZP) ఆరోపించారు. తనను కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి(Minister Niranjan Reddy) ఫోన్ చేసి తన గోడును వెళ్లబోసుకుని విలపించారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ (Gadwal District Collector), జెడ్పీ సీఈఓ మధ్య వివాదం ముదిరింది. కలెక్టర్ వల్లూరి క్రాంతి (Collector Valloori Kranti) తనను రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని జెడ్పీ సీఈఓ విజయనాయక్ (Vijayanaik is the CEO of ZP) ఆరోపించారు. తనను కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి(Minister Niranjan Reddy) ఫోన్ చేసి తన గోడును వెళ్లబోసుకుని విలపించారు. అంతేకాకుండా.. ప్రభుత్వ పథకాలపై కలెక్టర్ వల్లూరి క్రాంతికి అవగాహన లేదని కూడా ఆరోపించారు. ప్రజలకు నిస్వార్థంగా సేవచేస్తున్నానని మంత్రికి చెప్పుకొచ్చారు. తనపై కక్ష సాధిస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్నారు. జెడ్పీ సీఈఓ తన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తుండటంతోనే ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి వచ్చిందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయా నాయక్‌ను పంచాయతీరాజ్(Panchayat Raj) రూరల్ డెవలప్మెంట్ కమిషనర్‌కు సరెండర్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిబంధనల ప్రకారం(According to the regulations0 విధులు నిర్వహించడం లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవడం లేదని, పథకాల అమలులో జాప్యాలు ఉన్నాయన్న కారణాలతో ఆమెను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. విజయానాయక్ జడ్పీ సీఈవోగా గద్వాలకు వచ్చి దాదాపు రెండేళ్లకుపైగా అవుతోంది. ఈ విషయంపై విజయానాయక్ మీడియతో మాట్లాడారు. తాను విధుల పట్ల ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని తెలిపారు. కలెక్టర్ (Collector) తనను అన్యాయంగా సరెండర్ చేశారని ఆరోపించారు. జిల్లా పరిషత్ సమావేశాలకు(Zilla Parishad meeting) అనేక సార్లు కలెక్టర్ రాకపోతే సభ్యులు పట్టుబట్టినా, తాను నచ్చజెప్పి సమావేశాలు నిర్వహించానని చెప్పారు. కలెక్టరే నిర్లక్ష్యం వహించేవారని అన్నారు. సరెండర్‌పై న్యాయ పోరాటం చేస్తానని, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులతో వివరిస్తానని తెలిపారు. అంతిమంగా తన నిజాయితీ, అంకితభావమే బయటపడుతుందని అన్నారు.