సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద (Swaroopananda Swamy) విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (software engineer) ట్విట్టర్‌లో రాసిన లేఖ వైరల్ అవుతోంది.
జేడీఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి (HD Kumaraswamy) స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, అలసట కారణంగానే కుమారస్వామి నీరసించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అమిత్‌షా (Amit Shah) నేటి చేవెళ్ల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్ బ్రిడ్జి వద్ద దారిమళ్లించి, శంకర్‌పల్లి, పర్వేద ఎక్స్‌రోడ్, ఆలూర్ మీదుగా వికారాబాద్ వైపు అనుమతిస్తారు.
దాదాపు 35 రోజులగా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు చిక్కాడు.
ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు, నిఘంటు నిర్మాణకర్త ఆచార్య రవ్వా శ్రీహరి (Ravva srihari) గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ మలక్‌పేటలో ఆయన కన్నుమూశారు.
రేపటి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో అమిత్ షా తేనేటీ విందు కార్యక్రమం రద్దయ్యింది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించిన కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత తనకు మాత్రమే ఉందన్నారు. అన్ని పార్టీలు కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేద్దామని పిలుపునిచ్చారు.
సచివాలయ భద్రత బాధ్యతలను టీఎస్‌ఎస్‌పీ (TSSP) చేతికి అప్పగించారు. 350 మందికి పైగా టీఎస్‌ఎస్‌పీ సిబ్బందితోపాటు దాదాపు 300 మంది సాయుధ రిజర్వు పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు.
రంజాన్ పర్వదినాన కమెడియన్ అలీ.. మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi)ని కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్.. అతడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.