• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

I-T teams at BBC offices:ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాల్లో ఐటీ టీమ్ సర్వే, కారణమిదే?

I-T teams at BBC offices:బీబీసీ ఆఫీసుల్లో (bbc office) ఆదాయపన్ను (income tax) శాఖ అధికారుల బృందాలు సోమవారం సర్వే చేపట్టాయి. ముంబై (mumbai), ఢిల్లీలో (delhi) గల కార్యాలయాలకు ఈ రోజు ఉదయం చేరుకున్నాయి. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైళ్లను (mobiles) స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కార్యాలయాన్ని వదిలి వెళ్లిపోవాలని ఉద్యోగులను కోరినట్టు తెలిసింది.

February 14, 2023 / 05:05 PM IST

Amit Shah : 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎదురు లేదు : అమిత్ షా

2024 ఎన్నికల్లో తమకు ఏ పార్టీతో పోటీ ఉండదని కేంద్ర హొంశాఖ మంత్రి (Amith Shah) అమిత్ షా అన్నారు. యావత్ దేశం ప్రధాని మోదీకీ మద్దతుగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. (Ani) ఏఎన్ఐ మీడియ సంస్దకు ఇంటర్వూలో భాగంగా షా పలు అంశాలపై మాట్లాడారు.

February 14, 2023 / 03:31 PM IST

Bandla Ganesh : లవ్ యూ కేసీఆర్ సర్ అంటూ.. బండ్ల ట్వీట్స్…!

Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఎప్పుడు ఎలా స్పందిస్తారో చెప్పలేం. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ.. ఆర్జీవీ తర్వాత... హాట్ టాపిక్ గా మారే వ్యక్తి బండ్ల అని చెప్పొచ్చు. నిత్యం పవన్ కళ్యాణ్ జపం చేసే ఆయన.. తాజాగా.. సీఎం కేసీఆర్ పై ప్రశసంల జల్లు కురిపించారు. ఒక్కసారిగా ఆయనకు కేసీఆర్ పై ప్రేమ రావడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...

February 14, 2023 / 03:49 PM IST

lines on car glass:కారు అద్దంపై గీతలు ఎందుకు ఉంటాయి? కారణమిదేనా?

కారు వెనకల గల అద్దంపై ఉండే గీతలను డీ ఫాగర్స్ (defoggers) అంటారు. ఇవి ఎలక్ట్రికల్ గీతలు (electric lines). వీటి ద్వారా కరెంట్ పాస్ (current pass) అవుతుంది. తేమ మంచు తొలగిపోయి క్లియర్‌గా కనబడుతుంది. ముఖ్యంగా చలికాలం, వర్షకాలంలో వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది.

February 14, 2023 / 02:34 PM IST

Komatireddy: హంగ్, బీఆర్ఎస్-కాంగ్రెస్ దోస్తీ అంటూ సంచలనం

నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల అనంతరం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో కలిసి వెళ్లదని, అలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.

February 14, 2023 / 01:51 PM IST

vangalapudi anitha: జగన్ నీకు సిగ్గనిపించడం లేదా? రిజైన్ చేస్తే దరిద్రం పోతుంది

ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రి వనిత తమ పదవులకు రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలి పోతుందని తెలుగు మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత మంగళవారం మండిపడ్డారు. తాడేపల్లి పరిధిలో ఓ అంధురాలిపై గంజాయి బ్యాచ్ కత్తితో దాడి చేసి, హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 14, 2023 / 01:23 PM IST

Amit Shah : కోర్టుకు వెళ్లండి… కాంగ్రెస్ కి అమిత్ షా సవాలు…!

Amith Shah : కాంగ్రెస్ కి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. అదానీ అంశంపై తామేదీ దాచిపెట్టే ప్రసక్తి లేదని, దీనిపై భయపడబోమని ఆయన పేర్కొన్నారు. కావాలంటే కాంగ్రెస్ కోర్టుకు కూడా వెళ్లవచ్చని ఆయన అన్నారు. పెగాసస్ అంశంపైనా మీరు ఇలాగే ఫేక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

February 14, 2023 / 01:08 PM IST

Revanth Reddy: రూ.500కే సిలిండర్, కాంగ్రెస్ ఆఫర్

కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వస్తే తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ (gas cylinder) అందిస్తామని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు.

February 14, 2023 / 11:48 AM IST

Michigan University firing: అమెరికా వర్సిటీలో కాల్పులు, ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మిచికాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.

February 14, 2023 / 10:53 AM IST

Rahul Gandhi : నేను మాట్లాడితే మోదీకి వణుకు…

Rahul Gandhi : ప్రధాని మోదీ పై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లో పర్యటిస్తున్న ఆయన... అధికార పార్టీ పై మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడిన ప్రసంగంలో కొంత భాగాన్ని తొలగించారని ఆయన ఆరోపించారు.

February 14, 2023 / 10:47 AM IST

HD Kumaraswamy: బ్రాహ్మణులు సీఎం కావొచ్చు.. కానీ వారు మాత్రమే

జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్నాటకలో రాజకీయ దుమారం రేపాయి. దీంతో అతను తాను చేసిన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీష్వా డీఎన్ఏ ఉన్నవారు ముఖ్యమంత్రి కావొద్దని మాత్రమే తాను చెప్పానని, కానీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి కావొద్దని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

February 14, 2023 / 10:23 AM IST

Kodali Nani: షాకింగ్… జగన్ పతనం కోరుకున్న వైయస్ వివేకా

వివేకానంద రెడ్డి బతికి ఉన్నా.. చనిపోయినా తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కడప లోకసభ స్థానాన్ని అవినాశ్ రెడ్డికే ఇచ్చేవారని స్పష్టం చేశారు. ఇందుకు కారణం కూడా ఉందని చెప్పారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కడప ఎంపీగా, వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో వివేకానంద, కుటుంబం ప్రత్యర్థి పార్టీ తరఫున నిలిచారని గుర్తు చేశారు. సొంత అన్న కొడుకును, వదినను ఓడించేందుకు ప్రయత్నించారన్నారు.

February 14, 2023 / 09:51 AM IST

Woman married God Shiva: శివుడిని పెళ్లి చేసుకున్న యువతి, ఎందుకంటే?

మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖితా చౌరిసియా... శివుడిని పెళ్లి చేసుకున్నది. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే కళ్యాణతోటలో కొలువై ఉన్న శివుడి మెడలో పూలమాల వేసి, శివుడిని భర్తగా అంగీకరించింది.

February 14, 2023 / 09:16 AM IST

Valentines Day: అద్దెకు అబ్బాయి… ఒంటరిగా ఉన్నారా, అయితే ఈ ఆఫర్ మీకే!

గురుగ్రామ్‌కు చెందిన ఓ టెక్కీ యువకుడు ఓ వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చాడు. లవర్స్ డే రోజున సింగిల్స్ అయిన యువతులు తమ సేవలను వినియోగించుకోవాలని వినూత్న ప్రచారం ప్రారంభించాడు. తమ భాగస్వామి కోసం వెతికే యువతుల కోసం తక్కువ ధరకే బాయ్ ఫ్రెండ్‌ను అందిస్తామని అందరినీ ఆకర్షిస్తున్నాడు. 31 ఏళ్ల షకుల్ గుప్తా తన ఇన్‌స్టాలో 'boyfriend on rent'తో ప్రమోట్ చేస్తున్నాడు.

February 14, 2023 / 08:11 AM IST

Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరు మార్చేశారు

విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం... తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. ఇప్పుడు ఆ కళాక్షేత్రం పేరు కూడా మారింది! ఈ పేరులోను తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది.

February 14, 2023 / 07:30 AM IST