»Techie Offers Boyfriend On Rent Service On Valentines Day
Valentines Day: అద్దెకు అబ్బాయి… ఒంటరిగా ఉన్నారా, అయితే ఈ ఆఫర్ మీకే!
గురుగ్రామ్‌కు చెందిన ఓ టెక్కీ యువకుడు ఓ వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చాడు. లవర్స్ డే రోజున సింగిల్స్ అయిన యువతులు తమ సేవలను వినియోగించుకోవాలని వినూత్న ప్రచారం ప్రారంభించాడు. తమ భాగస్వామి కోసం వెతికే యువతుల కోసం తక్కువ ధరకే బాయ్ ఫ్రెండ్‌ను అందిస్తామని అందరినీ ఆకర్షిస్తున్నాడు. 31 ఏళ్ల షకుల్ గుప్తా తన ఇన్‌స్టాలో 'boyfriend on rent'తో ప్రమోట్ చేస్తున్నాడు.
ఫిబ్రవరి 14న… వాలంటైన్స్ డే (valentine’s day). ఎంతోమంది ఈ రోజున తమ ప్రేమను తమ ప్రియుడికి లేదా ప్రియురాలికి వ్యక్తం చేసేందుకు ఆసక్తి చూపించే రోజు. ప్రేమలో మునిగితేలేవారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాలంటైన్ డేను ప్రేమికుల దినోత్సవంగా కూడా పిలుస్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ సహా వివిధ దేశాల్లో ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భారత్‌లోను చాలామంది ఈ రోజు కోసం వేచి చూస్తారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు చిన్న చిన్న నగరాల్లోను వివిధ దుకాణాలు లవర్స్ డే గ్రీటింగ్స్ చెబుతూ… ప్రేమికులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటాయి. అదే సమయంలో దీనిని వ్యతిరేకించే వారు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి ఏడాది లవర్స్ డే పట్ల నిరసనలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ప్రేమికుల దినోత్సవాన్నిఘనంగా నిర్వహించుకునే వారు, వ్యతిరేకించుకునే వారు ఉన్న విషయాన్ని పక్కన పెడితే…. గురుగ్రామ్‌కు చెందిన ఓ టెక్కీ యువకుడు ఓ వినూత్న ప్రచారంతో ముందుకు వచ్చాడు. లవర్స్ డే రోజున సింగిల్స్ అయిన యువతులు తమ సేవలను వినియోగించుకోవాలని వినూత్న ప్రచారం ప్రారంభించాడు.
తమ భాగస్వామి కోసం వెతికే యువతుల కోసం తక్కువ ధరకే బాయ్ ఫ్రెండ్‌ను అందిస్తామని అందరినీ ఆకర్షిస్తున్నాడు. 31 ఏళ్ల షకుల్ గుప్తా తన ఇన్‌స్టాలో ‘boyfriend on rent’తో ప్రమోట్ చేస్తున్నాడు. తనకు ఎదురైన అనుభవం నుండే ఈ కాన్సెప్ట్‌లోకి వచ్చినట్లు చెబుతున్నాడు. ఇలాంటి రోజున తమకు కూడా ఓ ప్రియుడు/ప్రియురాలు ఉంటే బాగుంటుందని యువత భావిస్తోందని, అందుకే తాను 2018 నుండి ఈ సేవలు నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. ప్రేమికుల రోజు ఒంటరిగా ఉండాలంటే బోర్ ఫీలయ్యేవారు తన సేవలు అందుకోవాలని సూచించాడు. వెల్లడించాడు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఉద్దేశ్యం వెనుక కమర్షియల్ లేదా వ్యామోహ ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఒంటరిగా ఫీలయ్యే వారి కోసం మాత్రమే దీనిని ప్రారంభించినట్లు చెప్పాడు. ‘మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, సహవాసం అవసరమైతే నన్ను అద్దెకు తీసుకోవడానికి సిగ్గుపడకండి. ఇలా మీకు మీ జీవితంలోనే అత్యుత్తమ రోజును మీకు అందించగలను’ అని పేర్కొన్నాడు షకుల్.
వాలంటైన్ రోజున జంటలు ఒకరికి మరొకరు I Love You అని చెప్పుకుంటారని, ఇలాంటి రోజున ఒంటరిగా ఉండేవారు ఎలా ఉంటారో తన మనసులో ఓ ఆలోచన మెదిలిందని, తనకు గర్ల్ ఫ్రెండ్ లేకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుండి పుట్టిందే ఇది అని చెప్పాడు. తన వరకు గర్ల్ ప్రెండ్ అనవసరం అనిపించిందని, కానీ కొంతమందికి ఆ ఫీలింగ్ కోసం తీసుకు వచ్చానని చెప్పాడు. అయితే తన ఈ సేవలు కేవలం ప్రేమికుల రోజు వరకే పరిమితం కాదనే విషయాన్ని గుర్తించాలన్నాడు. గత అయిదేళ్లుగా బాయ్ ఫ్రెండ్ ఆన్ రెంట్ ద్వారా 50కి పైగా మహిళలతో డేటింగ్ చేసినట్లు కూడా చెప్పాడు ఈ టెక్కీ. వారితో కలిసి భోజనం చేసే సమయంలో, ఇతర సమయాల్లో ఆప్యాయంగా మాట్లాడుతానని చెప్పాడు. తన ఈ ఆలోచనను ఎవరైనా విమర్శిస్తే తాను కేవలం నవ్వి ఊరుకుంటానని చెప్పాడు.