Amit Shah : 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎదురు లేదు : అమిత్ షా
2024 ఎన్నికల్లో తమకు ఏ పార్టీతో పోటీ ఉండదని కేంద్ర హొంశాఖ మంత్రి (Amith Shah) అమిత్ షా అన్నారు. యావత్ దేశం ప్రధాని మోదీకీ మద్దతుగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. (Ani) ఏఎన్ఐ మీడియ సంస్దకు ఇంటర్వూలో భాగంగా షా పలు అంశాలపై మాట్లాడారు.
2024 ఎన్నికల్లో తమకు ఏ పార్టీతో పోటీ ఉండదని కేంద్ర హొంశాఖ మంత్రి (Amith Shah) అమిత్ షా అన్నారు. యావత్ దేశం ప్రధాని మోదీకీ మద్దతుగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. (Ani) ఏఎన్ఐ మీడియ సంస్దకు ఇంటర్వూలో భాగంగా షా పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో చర్యలు ,కార్యక్రమాలతో క్షేత్రస్దాయిలో ప్రజల జీవితాల్ల సానుకూలమైనమార్పుకనిపిస్తోందన్నారు అందుకే వచ్చే సార్వత్రిక (elections) ఎన్నికల్లో ప్రజలంతా (Modi)మోదీ వెంటే నిలబడతారని, తమకుపోటీ ఉండదన్న అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు. ప్రజలు గత ఎన్నికల్లో ఎవ్వరికీ ప్రతిపక్ష హోదా కట్టబెట్టలేదన్న విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో దేశ (people) ప్రజలు ప్రధాన ప్రతిపక్షం (the opposition) ఎవరనేది తేలుస్తారని చెప్పారు. ఎన్నికలు జరిగే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రచారం చేయకపోవచ్చన్నారు.
కాంగ్రెస్ ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీ బలమేంటో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రాలతో పాటు, ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఛత్తీస్ గఢ్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని అమిత్ షా అంచనా వేశారు. దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని చెబుతూ.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారినట్టు తెలిపారు. అంతర్గత భద్రతను తమ సర్కారు బలోపేతం చేసిందని, దిగుమతుల( of imports) పై ఆధారపడడాన్ని తగ్గించినట్టు వివరించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మాత్రమే ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో ఈ అవకాశాన్ని ఏ పార్టీకి వారు ఇవ్వలేదని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చిందని అమిత్షా అన్నారు. అందుకే 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలంతా ప్రధాని మోదీకే మరోసారి పట్టం గడతారని దీమా వ్యక్తం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న (North Eastern State) ఈశాన్య రాష్ట్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేయకపోవడంపై అమిత్ షా సెటైర్లు వేశారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటో తేలిపోతుందన్నారు. ఒకప్పుడు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్(Congress) బలంగా ఉండేదని గుర్తు చేశారు..ఈ సందర్భంగా నగరాలు, ప్రాంతాలకు పేర్లు మారుస్తూ మొఘల్ సామ్రాజ్య చరిత్రను బీజేపీ తుడిచేయాలని చూస్తోందంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు కేంద్రమంత్రి గట్టిగా బదులిచ్చారు. ‘‘చరిత్రలో ఎవరి సహకారాన్ని తుడిచేయాలని మేం కోరుకోవట్లేదు. పాత పేర్లు లేని ఒక్క నగరం పేరు కూడా మేం మార్చట్లేదు. కేవలం అంతకుముందు పాత పేర్లు ఉన్నవాటివే మారుస్తున్నాం. మా ప్రభుత్వం అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ప్రతి ప్రభుత్వానికి కొన్ని చట్టబద్ధమైన హక్కులుంటాయి’’ అని అమిత్ షా (Amit shah) వివరించారు.ఇదే తొలిసారి కాదు ఇక, పార్లమెంట్లో రాహుల్, ఖర్గే ప్రసంగంలోని కొన్ని పదాలను తొలగించడంపై కేంద్రమంత్రి స్పందిస్తూ.పదాలను తొలగించడం చరిత్రలో ఇదే తొలిసారి కాదు. ఉభయ సభలు ఉన్నవే చర్చలు జరపడానికి. అవి పార్లమెంట్ పరిభాష, విధివిధానాలకు లోబడే జరగాలి’’ అని తెలిపారు. ప్రధాని మోదీ (Modi) ప్రసంగం సమయంలో పార్లమెంట్ (Parliament)లో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారంటూ ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.