Bandla Ganesh : లవ్ యూ కేసీఆర్ సర్ అంటూ.. బండ్ల ట్వీట్స్…!
Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఎప్పుడు ఎలా స్పందిస్తారో చెప్పలేం. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ.. ఆర్జీవీ తర్వాత... హాట్ టాపిక్ గా మారే వ్యక్తి బండ్ల అని చెప్పొచ్చు. నిత్యం పవన్ కళ్యాణ్ జపం చేసే ఆయన.. తాజాగా.. సీఎం కేసీఆర్ పై ప్రశసంల జల్లు కురిపించారు. ఒక్కసారిగా ఆయనకు కేసీఆర్ పై ప్రేమ రావడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే...
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఎప్పుడు ఎలా స్పందిస్తారో చెప్పలేం. తనకు సంబంధం లేని విషయాలపై కూడా స్పందిస్తూ.. ఆర్జీవీ తర్వాత… హాట్ టాపిక్ గా మారే వ్యక్తి బండ్ల అని చెప్పొచ్చు. నిత్యం పవన్ కళ్యాణ్ జపం చేసే ఆయన.. తాజాగా.. సీఎం కేసీఆర్ పై ప్రశసంల జల్లు కురిపించారు. ఒక్కసారిగా ఆయనకు కేసీఆర్ పై ప్రేమ రావడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే…
బండ్ల గణేష్ కుటుంబంతో కలిసి యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఆలయం నిర్మించిన తీరు ఆయనను అమితంగా ఆకట్టుకుంది. అంతే… దానిని అంత అందంగా నిర్మించిన కేసీఆర్ పై బండ్ల పొగడ్తల వర్షం కురిపించారు.
‘ఏ స్వార్థం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు. నా మనసులోని మాటలు చెప్తున్నాను. మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను. అది నా నైజం సార్..! మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్ గారు ’ అంటూ ట్వీట్ చేశారు.
ఎన్నో రోజుల నుంచి శ్రీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.. ఆ స్వామి వారి అనుగ్రహం లేక నాకు రావటం కుదరలేదు. కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి శ్రీ కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కతజ్ఞతలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.