»At Least 3 Dead In Mass Shooting At Michigan State University
Michigan University firing: అమెరికా వర్సిటీలో కాల్పులు, ముగ్గురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మిచికాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. మిచికాన్ స్టేట్ యూనివర్సిటీ (Michigan State University) ప్రధాన క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది. వీరిని హాస్పిటల్ తరలించారు. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూనివర్సిటీలోకి వచ్చిన అతను క్యాంపస్‌లోని రెండు భవనాల వద్ద కాల్పులు జరిపాడు. విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురై గదులలోకి పారిపోయారు. కాల్పులు జరిపిన తర్వాత అగంతకుడు అక్కడి నుండి పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో 48 గంటల పాటు క్యాంపస్‌లోని అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలు రద్దు చేశారు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పోలీసులు అనుమానాస్పద గన్‌మెన్ ముఖచిత్రాన్ని విడుదల చేశారు. నిందితుడు కాస్త పొట్టిగా ఉండి, ఎరుపు రంగు షూస్ ధరించినట్లుగా గుర్తించారు పోలీసులు. అతను ముఖానికి నల్లటి ముసుగు ధరించాడు. బేస్ బాల్ క్యాప్ ధరించాడు. అయితే ఒకరికి మించి కూడా యూనివర్సిటీలోకి ప్రవేశించారా లేదా తెలియాల్సి ఉంది.