• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కృష్ణా: తోట్లవల్లూరు (మం) బందరు కాలువ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి తోట్లవల్లూరు మండలం పాములలంక గ్రామానికి చెందిన పిల్లి సోమేశ్వరరావుగా (40) గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై అర్జున్ రాజు కేసు నమోదు చేశారు.

December 27, 2024 / 01:36 PM IST

స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి: కవిత

NZB: కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆమె బీసీ సంఘాలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది అని అన్నారు.

పొదలకూరులో 1.5 మిమీ వర్షపాతం నమోదు

NLR: పొదలకూరు మండలంలో శుక్రవారం 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురుస్తోంది. చలి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాలలోని రహదారులు బురదమయంగా మారడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

December 27, 2024 / 01:35 PM IST

మాజీ ప్రధాని మృతి దేశానికి తీరని లోటు: ఎమ్మెల్యే

BHNG: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంతాపం తెలిపారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు.

December 27, 2024 / 01:34 PM IST

నేడు మంత్రి తుమ్మల నేటి పర్యటన వాయిదా

KMM: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారిక పర్యటన వాయిదా వేయడం జరిగిందిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ గమనించి సంతాప కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు.

December 27, 2024 / 01:33 PM IST

“ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు మన్మోహన్ సింగ్”

MBNR: భారతదేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందన్నారు.

విద్యుత్ చార్జీల పెంపుపై మాజీమంత్రి నిరసన

PLD: విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా చేస్తున్న పోరాట కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణంలోని విద్యుత్ సబ్‌‌స్టేషన్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి విడదల రజిని పాల్గొని నిరసన తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీంటీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

December 27, 2024 / 01:33 PM IST

స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 5  ఐపీఓలు

ఐపీఓకు వచ్చిన ఐదు కంపెనీలు ఇవాళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అందులో మమతా మెషినరీ 147% ప్రీమియంతో రూ.600 వద్ద లిస్ట్ అవగా.. ఇష్యూ ధర రూ.243. ట్రాన్స్ రైల్ లైటింగ్ 37% ప్రీమియంతో రూ.590 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా.. ఇష్యూ ధర రూ.432. కాగా.. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ 39%, సనాతన్ టెక్స్‌టైల్స్ 32%, కాంకర్డ్‌ ఎన్విరో 18% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.

December 27, 2024 / 12:22 PM IST

వెనక్కి తగ్గేదే లేదు: కొరముట్ల

అన్నమయ్య: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైల్వేకోడూరు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ నుండి ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ కార్యాలయం వరకు మాజీశాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యుత్ ఏడికి వినతిపత్రం సమర్పించారు.

December 27, 2024 / 03:32 PM IST

వైసీపీ నిరసనలు చేయటం సిగ్గుచేటు: మంత్రి

AP: విద్యుత్ ఛార్జీలపై YCP నిరసనలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతో ధర్నాలు చేయించటం సైకో చర్యని అభివర్ణించారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం అదనంగా రూ.19 వేల కోట్లు ఖర్చు చేయడం నిజం కాదా అని నిలదీశారు. కమీషన్ల కోసం యూనిట్‌ను రూ.8 నుంచి రూ.14కి కొనుగోలు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు.

December 27, 2024 / 12:16 PM IST

మన్మోహన్‌ ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసేవారో తెలుసా..?

దేశ ఆర్థిక దిక్సూచి మన్మోహన్ ప్రణాళికా బద్ధంగా ఇన్వెస్ట్‌ చేసేవారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీస్‌ పథకాలే పెట్టుబడి మార్గాలుగా ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రమాణ పత్రంలో తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్‌లో రూ.7 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రూ.12 లక్షలు పోస్టాఫీస్‌ నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టారు.

December 27, 2024 / 12:08 PM IST