GNTR: దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో రెండు నూతన హెల్త్ & వెల్నెస్ (విలేజ్) సెంటర్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. మంత్రి నారా లోకేష్ చొరవతో రూ. 72 లక్షల వ్యయంతో ఈ కేంద్రాలు నిర్మించనున్నారు. కూటమి నాయకులు శంకుస్థాపన నిర్వహించి, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొన్నారు.
HYD: ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను సినీ నటి మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్‌గా తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27న నిర్వహించనున్న కార్యక్రమానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు. తమ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మి, సీతక్కకు వివరించారు.
BPT: రేపల్లె నియోజకవర్గంలో రూ. 31 కోట్లతో చేపట్టిన 28 ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ పనులు 90 శాతం పూర్తయ్యాయని మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడంపై మాజీ మంత్రి డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన, కొత్త భవనం పూర్తయినా వాడుకలోకి తేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య మేనని మండిపడ్డారు. మార్చురీలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరం జరిగిందని విమర్శించారు.
BDK: ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులను తక్షణమే ఆపాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అశ్వరావుపేట మండలం ఉరుములబండ గ్రామంలో ఆదివాసి దళిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీలు పలు విషయాలను వెల్లడించారు. తాము గత 35 సంవత్సరాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు వెల్లడించారు.
TG: జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో శవాన్ని కుక్కలు పీక్కు తినడంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత రోజులు తెస్తామన్న మాటను ఇవాళ నిజం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ ఆస్పత్రిలో మార్చురి గది నిర్మాణం పూర్తయి.. ఏడాదిన్నర అవుతున్న ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రారంభానికి నోచుకేలేదని విమర్శించారు.
KNR: కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో హోలీ పండుగను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. క్యాంపస్ అంతా రంగుల హరివిల్లు వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు పరస్పరం రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నృత్యాలతో యువత సందడి చేశారు. ఐక్యత, స్నేహభావానికి ప్రతీకగా హోలీ వేడుకలను ఆనందంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.
TPT: పుత్తూరులో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటేష్ మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. “చలో విజయవాడ” సందర్భంగా విజయవాడలో అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
JGL: మెట్‌పల్లి పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విధి నిర్వహణ ఒత్తిడిని పక్కనపెట్టి, ఉద్యోగులందరూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బస్టాండ్ పరిసరాల్లో యువత, ఉద్యోగులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.
అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక సూచనలు చేశాడు. అభిషేక్ షాట్ సెలక్షన్‌పై దృష్టి పెట్టాలని తివారీ సూచించాడు. అనవసరమైన షాట్లు ఆడి వికెట్ పారేసుకోవద్దని హెచ్చరించాడు. భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారని, కాబట్టి వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకోవద్దని చెప్పాడు. సెమీస్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాలని ఆకాంక్షించాడు.
MNCL: జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మంగళవారం గ్రామ సర్పంచ్ మురిమడుగుల కవితా రాజన్న ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా జెల్ల స్వామి, ఉపాధ్యక్షులుగా ఏదుల వంశీ, కోశాధికారిగా ఏదుల తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా మామిడి రాజన్న, ప్రచార కార్యదర్శిగా జెల్ల భీమయ్య, తదితరులను ఎన్నుకున్నారు.
MDK: చేగుంట మండల వ్యాప్తంగా హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి రంగులు చల్లుకుంటూ ఆనందాలు పంచుకున్నారు. చేగుంట మండల కేంద్రంలో రంగులు, రంగు నీళ్లు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ పండుగలో పాల్గొన్నారు. వీధులు, రోడ్డులు రంగులతో నిండిపోయాయి.
VKB: పెద్దేముల్ మండల కేంద్రంలో హోలీ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే మంగళవారం హోలీ పండుగను నిర్వహించారు. మరికొన్ని గ్రామాల్లో బుధవారం నిర్వహించనున్నట్లు పలువురు చెప్తున్నారు.
MHBD: నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్బంగా గూడూరు రేంజ్ డివిజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. “వన్యప్రాణులను కాపాడుదాం- భవిష్యత్తును రక్షిద్దాం” అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక BRS నాయకులు, తదితరులు ఉన్నారు.
WNP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైల్డ్ హెల్త్-100 కార్యక్రమాన్ని జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, ఆశ్రమ, మోడల్ స్కూళ్లలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేస్తామని డిఎంహెచ్‌వో సాయినాథ్ రెడ్డి తెలిపారు. ఇందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం అన్నారు. వంద రోజుల్లో 4 దశల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.