• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యాగంటి ఆలయంలో సోమవారం పూజలు

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సోమవారం పూజలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

February 23, 2026 / 09:29 AM IST

ముదురుతున్న వివాదం సవాళ్లు.. ప్రతి సవాళ్లు

KMR: కామారెడ్డి జిల్లా ఉద్రిక్త పరిస్థితుల అనంతరం కళాశాల ఆస్తుల విషయంలో నేరుగా కలెక్టర్ వద్దనే కూర్చుందామని, నేడు ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరోసారి సవాల్ చేశారు. దాంతో కళాశాల ఆస్తుల అన్యాక్రాంతం అంశం ఇప్పుడు కలెక్టర్ వద్దకు చేరింది. సోమవారం ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.

February 23, 2026 / 09:27 AM IST

కొత్తగూడెం కార్పొరేషన్‌లో సదుపాయాల కొరత

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ పాలకవర్గం ఏర్పాటైనా, తగిన సౌకర్యాలు ఇంకా కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం పాత కౌన్సిల్ హాల్లోనే నిర్వహించగా, భవిష్యత్ సమావేశాల నిర్వహణపై కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భవనం, ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరుగుతోంది.

February 23, 2026 / 09:26 AM IST

చిల్పూర్ గుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం

JN: చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూర్ గుట్టలో 9 రోజుల బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సేవలు, క్యూలైన్, వసతి, అన్నప్రసాద వితరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఈనెల 28న బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. దేవస్థానం ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తెలిపారు.

February 23, 2026 / 09:24 AM IST

T20 WC: అందుకే ఓడిపోయాం: సూర్య‌కుమార్

టీ20 వరల్డ్‌కప్-2026 సూపర్-8లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడంతోనే మ్యాచులో వెనుకబడ్డామని, ఆ తర్వాత ఫామ్‌లోకి రాలేకపోయామని చెప్పాడు. పవర్ ప్లేలో బ్యాటింగ్ మెరుగ్గా చేసుంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు.

February 23, 2026 / 09:23 AM IST

అసెంబ్లీకి రావాలని బొట్టుపెట్టి పిలవరు: లోకేష్

AP: అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేష్ చిట్‌చాట్ నిర్వహించారు. లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతామని తెలిపారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరని ఎద్దేవా చేశారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని చెప్పారు. దేవుడిని కూడా వైసీపీ రోడ్డుమీదకు తీసుకురావడం బాధాకమని అసహనం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 09:21 AM IST

21 డివిజన్‌లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ శ్రీనివాస్ కాలనీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ పరిసరాలను పారిశుధ్య పనులను సిబ్బంది ముమ్మరం చేశారు. గత కౌన్సిల్ గడువు ముగిసిపోవడంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నూతనంగా కార్పొరేటర్ ఫలితాలు వెలవడి, డివిజన్ నుంచి గెలిచిన గుండా సంతోష్ పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

February 23, 2026 / 09:21 AM IST

భూగర్భ రైల్వే వంతెన వద్ద స్టాపరు ఏర్పాటు

VZM: కొత్తవలస కూడలిలో ఇటీవల రైల్వే భూగర్భ వంతెన వద్ద వర్షం నీరు లోనికి ప్రవేశించకుండా కాలువ నిర్మాణం చేశారు. దీంతో వంతెన వెడల్పుగా ఉండడంతో వాహన ప్రమాదాలు జరగకుండా పోలీసులు మధ్యలో స్టాపరును ఏర్పాటుచేశారు. కూడలి నుంచి సబ్బవరం వెళ్లే వాహనాలు ఎడమవైపు నుంచి, అటు నుంచి కూడలికి వచ్చే వాహనాలు ఎడమవైపు వాహనాలు చూసుకొని కూడలికి చేరుకునేలా స్టాపరును ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 09:20 AM IST

‘పేదలకు నాణ్యమైన ఆహారమే ప్రభుత్వ లక్ష్యం’

SKLM: ఆమదాలవలస పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.పేద ప్రజలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

February 23, 2026 / 09:20 AM IST

విద్యుత్ వినియోగదారులకు గుడ్‌న్యూస్

TG: విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టేందుకు TGSPDCL వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లేటెస్ట్ టెక్నాలజీతో వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఫోన్‌లో 8712441912 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పంపితే సరిపోతుంది. ఫిర్యాదులు నమోదు చేయడం, కరెంట్ బిల్లు వివరాలు తదితర సేవలను సులభంగా పొందవచ్చు.

February 23, 2026 / 09:20 AM IST

నేటి నుంచి ప్రజావాణి ప్రారంభం: వనపర్తి కలెక్టర్

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్య క్రమం నేటి నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతులను సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

February 23, 2026 / 09:19 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖిలా WGLకు చెందిన కోల వెంకటేష్ (38) ద్విచక్ర వాహనంపై వరంగల్ మున్సిపాలిటీ వైపు వస్తుండగా, ఎదురుగా వచ్చిన టిప్పర్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

February 23, 2026 / 09:18 AM IST

రాజకీయ యోధుడు జేసీ దివాకర్ రెడ్డి

ATP: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత జేసీ దివాకర్ రెడ్డి. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అనుచరులు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన, వైఎస్ఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. వయోభారం కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.

February 23, 2026 / 09:17 AM IST

కబడ్డీ ఆడిన క్రీడా శాఖ మంత్రి

NRPT: మక్తల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ ఆదివారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఆయన క్రీడాకారులతో సరదాగా కబడ్డీ ఆడి అలరించారు. పురుషుల రంగారెడ్డి-గద్వాల్, మహిళల రంగారెడ్డి-ఆదిలాబాద్ జట్ల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ను మంత్రి తిలకించారు.

February 23, 2026 / 09:16 AM IST

బైక్ అదుపుతప్పి ప్రమాదం.. యువకుడి మృతి

W.G: నరసాపురంలోని 25వ వార్డు ఆదర్శనగర్‌కు చెందిన శ్రీశైలం హరి కనక సాయి(31) అనే యువకుడు మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున సాయి బైక్‌పై వెళ్తుండగా అంబేడ్కర్ విగ్రహం వద్ద బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వం ఆసుపత్రి తరలించారు.

February 23, 2026 / 09:16 AM IST