• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆకస్మిక వాహన తనిఖీలు

ATP: నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత లక్ష్యంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి జాతీయ రహదారులు, ముఖ్య కూడళ్లలో వాహనాలను ఆపి పత్రాలను పరిశీలించారు. అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలను అరికట్టడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:27 AM IST

రావులపాలెం రైతు బజార్‌కు నేడు వారాంతపు సెలవు

కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్‌కు ఇకపై ప్రతి మంగళవారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..వారాంతపు సెలవుగా నిర్ణయించినట్లు ఎస్టేట్ ఆఫీసర్ తేజ సోమవారం తెలిపారు. కావున రైతులు, వ్యాపారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కావున మంగళవారం రైతు బజార్ మూసి ఉంటుందని,వినియోగదారులు ఈ మార్పును గమనించాలన్నారు.

February 24, 2026 / 10:27 AM IST

రోజ్ వాటర్ ముఖానికి మేలు చేస్తుందా..?

ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనెను, మురికిని తొలగించడంలో రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఎండ వల్ల చర్మం కందిపోయినా లేదా ఎర్రగా మారినా కొద్దిగా రోజ్ వాటర్ చిలకరిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కానీ మొదటి సారి వాడేటప్పుడు చేతిపై కొద్దిగా రాసి ‘ప్యాచ్ టెస్ట్’ చేసుకోవడం ఉత్తమం.

February 24, 2026 / 10:27 AM IST

10KG టమాటా బాక్స్ రూ.100..!

అన్నమయ్య: మదనపల్లెలో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాల మార్కెట్‌కు 66 వేల కిలోల (66 మెట్రిక్ టన్నుల) టమాటాలను రైతులు తీసుకువచ్చారు. మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.140, రెండవ రకం రూ.110, మూడవ రకం రూ.100లతో అమ్ముడుపోయినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అన్ సీజన్ కారణంగానే టమాటాలకు రేట్లు పెరగడంలేదని, దిగుబడి పెరిగినా.. గిట్టుబాటు ధరలు పలకడం లేదని రైతులు వాపోతున్నారు.

February 24, 2026 / 10:26 AM IST

నార్నూర్‌లో నేలకొరిగిన పంట పొలాలు

ADB: నార్నూర్ మండలం కొత్తపల్లి మాల్కుగూడలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కనక భీంరావ్‌కు చెందిన గోధుమ, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. సాయంత్రం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల వల్ల పంట పొలం నాశనమైందని రైతు తెలిపారు. ఈ సంఘటన రైతుకు తీరని నష్టాన్ని కలిగించింది.

February 24, 2026 / 10:26 AM IST

త్వరలో పశు వైద్యశాఖలో నియామకాలు: అచ్చెన్న

AP: వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమైన శాఖలకు తాళాలు వేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. అన్ని శాఖల్లో నిర్వహణను గాలికొదిలేసిందన్నారు. ఇబ్బందులు సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పశు వైద్యశాలల్లో సౌకర్యాలు, ఉపకరణాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు ఇస్తున్నామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడుతామన్నారు.

February 24, 2026 / 10:26 AM IST

నేటి నుంచి గరికపాటి ప్రవచనాలు

PDPL: మంథనిలో నేటి నుంచి మూడు రోజుల పాటు 24,25,26 తేదీలలో మహా సహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహా రావు ప్రవచనములకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు రోజులపాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మంథనిలోని మణికంఠ కళా ప్రాంగణం అయ్యప్ప దేవాలయంలో నిర్వహించుటకు నిర్ణయించకున్నారు. ఈ కార్యక్రమానికి భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వహకులు తెలిపారు.

February 24, 2026 / 10:24 AM IST

రేపటి నుంచి ప్రారంభ కానున్న ఇంటర్ పరీక్షలు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పరీక్షల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పరిరక్షణలో, పరీక్షల నిర్వహణ జరుగుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 163 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:24 AM IST

విజయ్, రష్మిక పెళ్లి సంబరాలు షురూ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో ఇవాళ సంగీత్, మెహందీ, రేపు హల్దీ జరగనున్నాయి. ఫిబ్రవరి 26న కేవలం 100 మంది అతిథుల మధ్య వీరి పెళ్లి జరగనుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ‘విరోష్’ గ్రీన్ థీమ్ మెనూ, విజయ్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

February 24, 2026 / 10:22 AM IST

శతాధిక వృద్ధురాలు ఫ్రీడమ్ ఫైటర్ మృతి

BHNG: రాజాపేట మండలం బేగంపేటకి చెందిన శతాధిక వృద్ధురాలు ఫ్రీడమ్ ఫైటర్ వలిమెల లక్ష్మి (106) సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె భర్త హన్మంత్ స్వాతంత్ర సమర యోధుడు. జైలు జీవితం కూడా గడిపారు. 106 సంవత్సరాలకు పైగా జీవించిన లక్ష్మి రజాకార్లతో పోరాటం, బాధలు, బాధ్యతలు, మనుమరాండ్లతో సుఖదుఃఖాలు, మనుమలు, పరిపూర్ణ జీవనం గడిపారని గ్రామస్తులు సంతాపం తెలిపారు.

February 24, 2026 / 10:22 AM IST

వనపర్తి రేవల్లి యూరియా బుకింగ్ ప్రారంభం

వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్, రేవల్లి సొసైటీల్లో యూరియా పంపిణీ కోసం స్లాట్ బుకింగ్ ఓపెన్ అయిందని అధికారులు తెలిపారు. నాగపూర్ సొసైటీలో 300 బస్తాలు, రేవల్లి సొసైటీలో 300 బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదికారులు సూచించారు.

February 24, 2026 / 10:20 AM IST

లాభాల మాయలో లక్షల మోసం

BDK: బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. అధిక లాభాల పేరుతో బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన మహిళ నుంచి రూ.1.82 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

February 24, 2026 / 10:19 AM IST

న్యాయవాది కళ్యాణిని పరామర్శించిన BJP అధ్యక్షుడు

NZB: రుద్రూర్‌లో న్యాయవాది కళ్యాణి నివాసానికి బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మంగళవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కళ్యాణికి ధైర్యం చెప్పి, పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా దినేశ్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 10:19 AM IST

కొడంగల్‌లో మెరిసిన ఒగ్గుడోలు కళకారుల విన్యాసం

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహించిన బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రలో ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ప్రదర్శనలు భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేశాయి.

February 24, 2026 / 10:19 AM IST

బావను కిరాతంగా నరికిచంపిన మరదలు

HNK: హసన్ పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో మంగళవారం బాల్నే మొగిలి సొంత మరదల చేత దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొగిలిని గొడ్డలితో, కత్తులతో అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా,  హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 10:19 AM IST