• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆటో-బైక్ ఢీ.. మహిళ మృతి, ఇద్దరికి గాయాలు

KMM: టేకులపల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సక్కుబాయి అనే మహిళ మృతి చెందింది. బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోగా, గాయపడిన బైక్ రైడర్, ఆటో డ్రైవర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

February 25, 2026 / 07:50 AM IST

‘నా క్యారెక్టర్ అబ్బాయిలకు చిరాకు తెప్పిస్తుంది’

శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. ఈ మూవీ గురించి హీరోయిన్ నయన్ సారిక స్పందిస్తూ.. ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కి చాలా షేడ్స్ వుంటాయి. కొంచెం ఫీమేల్ డామినేటింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్‌లో అబ్బాయిలకి కాస్త చిరాకు కలిగిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ FEB 27న విడుదల కానుంది.

February 25, 2026 / 07:49 AM IST

కేంద్ర నోడల్ అధికారిగా నీరజ్ కుమార్ గయాగి

VZM: భారత ప్రభుత్వం పీఎం శ్రీ పథకం అమలును పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన సుమారు 170 మంది అధికారులను నోడల్ అధికారులుగా నియమించిందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్ర నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీగా నీరజ్ కుమార్ గయాగి నియమితులైనట్లు చెప్పారు.

February 25, 2026 / 07:48 AM IST

జగన్‌తో కదిరి వైసీపీ ఇంఛార్జ్ భేటీ

సత్యసాయి: పులివెందుల పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ అహ్మద్ కలిశారు. కదిరి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను జగన్‌కు వివరించారు. వాణిజ్య విభాగం అధ్యక్షులు పీఎండీ షకీల్ కూడా ఈ భేటీలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు.

February 25, 2026 / 07:47 AM IST

ఏపీలో తపాళా శాఖ కీలక నిర్ణయం

AP: ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24 గంటలూ స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ సేవలను అందించనుంది. ఆ జాబితాలో విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, ఒంగోలు, గుంతకల్ ఉన్నాయి. అలాగే, మరో 242 పట్టణాల్లో సబ్ పోస్టాఫీస్‌ల పనివేళలను రెండు గంటలు పెంచింది.

February 25, 2026 / 07:47 AM IST

విద్యుత్ సరఫరాలో నేడు అంతరాయం

SRPT: కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, అంబేద్కర్ కాలనీ, టీచర్స్ కాలనీ ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మంగళవారం సాయంత్రం పట్టణ విద్యుత్ ఆపరేషన్ ఏఈ నరసింహనాయక్ పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 25, 2026 / 07:45 AM IST

రైల్వే గేట్ వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద ఎస్సై చంటిబాబు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వాహనాలను గుర్తించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అనుమతించిన పరిమితికి మేరకే ప్రయాణికులను తీసుకువెళ్లాలన్నారు.

February 25, 2026 / 07:45 AM IST

నేడు డయల్ యువర్ డీఎం

RR: మియాపూర్-2 డిపో పరిధిలో ఇవాళ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ వెంకటేశంగౌడ్ తెలిపారు. మియాపూర్, బాచుపల్లి, మల్లంపేట్, నిజాంపేట్ పరిసర ప్రాంతాల ప్రజలు సమస్యలతో పాటు సూచనలు, సలహాలు తెలిపేందుకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226420 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు.

February 25, 2026 / 07:43 AM IST

POSH చట్టం పోస్టర్ను ఆవిష్కరించిన అధికారులు

BHPL: జిల్లా IDOC కార్యాలయంలో POSH Act–2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా POSH చట్టం పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. సంక్షేమ అధికారి మల్లేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 44 అంతర్గత ఫిర్యాదు కమిటీలు (ICs), 7 ప్రైవేట్ సంస్థల్లో ICలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిగిలిన ప్రైవేట్ సంస్థలు కూడా తప్పనిసరిగా IC ఏర్పాటు చేయాలన్నారు.

February 25, 2026 / 07:43 AM IST

అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, రెండు ట్రాక్టర్లు పట్టివేత

SRCL: బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్సై రమాకాంత్ చేరుకున్నారు. సంఘటనా స్థలంలో జేసీబీ, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలో అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 25, 2026 / 07:42 AM IST

సీఎంను కలిసిన మున్సిపల్ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యేలు

JGL: జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన సమిండ్ల వాణి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేయగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసింగరావు పాల్గొన్నారు.

February 25, 2026 / 07:42 AM IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి

MNCL: హాజీపూర్ మండలం టీకానపల్లి చెరువులో పడి ఒకరు మృతి చెందినట్లు SI కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మృతుడిని అదే గ్రామానికి చెందిన మెడపట్ల పోచయ్యగా గుర్తించారు. మేకల కాపరి అయిన పోచయ్య చెరువు గట్టుపై నుంచి వెళ్తూ ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

February 25, 2026 / 07:42 AM IST

గాలివానకు నేలకొరిగిన మొక్కజొన్న

KMR: రాజంపేట మండలంలో కురిసిన గాలివానకు పలు గ్రామాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని పెద్దపల్లి, బసన్నపల్లి గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను సాగు చేశారు. గాలి వాన వల్ల మొక్కజొన్న పంట నేలకొరిగింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

February 25, 2026 / 07:42 AM IST

శాసనమండలిలో ఎమ్మెల్సీ గళం

W.G: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ఎమ్మెల్సీ గోపిమూర్తి మంగళవారం శాసనమండలిలో ప్రస్తావించారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీరిని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లోని అన్-ఎయిడెడ్ సిబ్బందిని సైతం రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

February 25, 2026 / 07:40 AM IST

పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు అందజేత

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పనిముట్లను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సామర్థ్యాన్ని పెంచేందుకు పనిముట్లు, రక్షణ పరికరాలను అందజేశామన్నారు. ఈ పరికరాలు నగర స్వచ్ఛతకు దోహదపడతాయన్నారు.

February 25, 2026 / 07:40 AM IST