JGL: జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత శిక్షణకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మార్చి1న ఉదయం 10-1 గంటల వరకు రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. హాల్ టికెట్, ఆధార్ కార్డు ఉంటేనే పరీక్షకు అనుమతిస్తామన్నారు.
ADB: కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిన ఆయనకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సాగర స్వాగతం పలికారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
కృష్ణా: మచిలీపట్నంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ నివాసంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయని మచిలీపట్నం కార్పొరేషన్ కౌన్సిల్‌పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టాభి స్మారక భవనం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
BPT: చీరాల తుఫాను వల్ల నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లిందని MLA కొండయ్య అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు చోట్ల గండ్లు పడ్డాయని, ప్రస్తుతం తాత్కాలిక కల్వర్టులతో నెట్టుకొస్తున్నామని తెలిపారు. శాశ్వత కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు.
ప్రకాశం: పామూరు పట్టణ వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షునిగా యాట వీరస్వామిను వైసీపీ అధిష్టానం నియమించారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దల నారాయణ యాదవ్‌కు, కృతజ్ఞతలు తెలిపారు. వీరాస్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.
SDPT: అక్కన్నపేట మండలంలోని అంతక్కపేట నుంచి చిన్నగుడిపాడు వెళ్లే రహదారిపై విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. చేతికందే ఎత్తులో తీగలు వేలాడుతుండటంతో స్థానికులు కర్రను స్తంభంగా ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఆపుతున్నారు. పగలు, రాత్రి రైతులు, ప్రయాణికులు తిరిగే ఈ దారిలో గాలివానకు కర్ర కూలితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
AP: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభలో లడ్డూపై లఘు చర్చలో గందరగోళం ఏర్పడింది. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వ స్టేట్‌మెంట్‌కు సిద్ధమయ్యారు. దీనిపై ఛైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. లఘుచర్చలో ప్రతిపక్షానికి మొదట అవకాశమని ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వ స్టేట్‌మెంట్ తర్వాతే చర్చించాలని మంత్రి అన్నారు.. ఈ గందరగోళంతో మండలి వాయిదా పడింది.
రాష్ట్రం పేరు మార్చడం అనేది కేవలం కాగితపు పని కాదు. దీనికి దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుంది. రైల్వే స్టేషన్లు, హైవేలు, ప్రభుత్వ భవనాల బోర్డులు మార్చడానికి ఈ భారీ నిధులు అవసరం. తాజాగా కేరళ పేరును కేరళంగా మార్చే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడనుంది.
NLR: నెల్లూరులోని మనుమసిద్దినగర్ వద్ద రోడ్డుపై ఇసుక ఇబ్బందికరంగా ఉంది. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పనుల నిర్మాణానికి రోడ్డు పక్కన ఇసుక తోలారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై ఇసుక కనపడక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో రోడ్లకు అడ్డంగా పనులు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వీటిని అరికట్టాలని కోరుతున్నారు.
NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీఎన్టీ హాస్టల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ప్లాస్టిక్ వస్తువుల వినియోగం దాని పర్యవసానాలు’ అనే అంశంపై గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.
పోలవరం జిల్లాలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా వివిధ గ్రామాల్లో పులి కనిపిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామ పరిసర ప్రాంతంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. 527/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 584 పరుగులకు ఆలౌటైంది. శుభమ్(121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (72) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
JGL: రూరల్ మండలం రఘురాములకోట గ్రామంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
HNK: ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నేడు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. డాక్టర్ మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షల పట్ల భయాన్ని, ఒత్తిడిని వదిలి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు.
NLG: మర్రిగూడ మండలం ఖుదాబాక్షపల్లిలో పశు వైద్య, పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ సురేందర్, యమునా ఆధ్వర్యంలో 21 గేదెలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయలక్ష్మి, గోపాలమిత్ర సూపర్వైజర్ ప్రసాద్ పాల్గొని పశుపోషకులకు అవగాహన కల్పించారు.