MLG: నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు నెలల పసిపాప మృతికి కారణమైన దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా కార్యదర్శి కోయల నర్సింహారావు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. పోలీసుల నిర్లక్ష్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెలిపారు.
KMM: BJP రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు అక్రమ అరెస్టు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ సోమవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకొని నిరసనను భగ్నం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నాయకులు తెలిపారు.
WG: విశాఖపట్నంలో నిర్వహించిన 31వ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో మోగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటారు. 9వ తరగతి చదువుతున్న ఆర్. వేణు అండర్-17 విభాగంలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు కె. సూర్య తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
NLG: అగ్రకుల దురహంకారంతో బీసీ కుటుంబానికి చెందిన వారిపై అమానుషంగా దాడి చేసి పసికందు మరణానికి కారణమైన వాళ్లపై హత్యకేసుతో పాటు నిందితులను అందరినీ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ కలిసి విజ్ఞప్తి చేశారు.
సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పల్లెకెలె వేదికగా రేపు పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే దాదాపు సెమీస్‌కు చేరుకుంటుంది. మరోవైపు, తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో పాక్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడితే పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
SRD: జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో రాణించడం అభినందనీయమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులను సోమవారం కార్యాలయంలో సన్మానించారు. మొత్తం జిల్లాకు 21 పతకాలు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
నంద్యాల: జిల్లాలో 1,00,686 మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు శాఖల సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఇవాళ ఆదేశించారు. ప్రతి వాలంటీర్‌కు 10 మంది చొప్పున అనుసంధానం చేసి మే 28న జరిగే ప్రీ–ఫైనల్ పరీక్షకు వంద శాతం హాజరు కల్పించాలని ఆమె సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వెల్లడించారు.
GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన నిత్య అన్నదాన పథకానికి బాపట్ల జిల్లా సూరేపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రావు సోమవారం రూ. లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ మాట్లాడుతూ.. స్వామివారి అన్నదాన పథకానికి, ఆలయ అభివృద్ధికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పించి సహకరించాలని కోరారు.
SRPT: కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎర్నేని కుసుమ సోమవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోదాడ పట్టణాన్ని జిల్లాలోని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. మౌలిక వసతుల మెరుగుదలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు.
AKP: కోటవురట్ల మండలం బీకెపల్లిలో 10 సీసీ రోడ్లు హోంమంత్రి వంగలపూడి అనిత చొరవతో మంజూరైనట్లు మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. పది రోడ్ల నిర్మాణానికి రూ.52 లక్షలు నిధులు విడుదలైనట్లు తెలిపారు. రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు.
కోనసీమ: రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన చొల్లంగి సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి విశాఖపట్నంకు చెందిన వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయులు రెడ్డి మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా సోమవారం రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. మంత్రి మాట్లాడుతూ.. తానే కాకుండా తన మిత్రులు కూడా సహాయం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.
WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.
WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.
NTR: మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ.20 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, చిలుకూరులో రూ.25 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ప్రధాన ధ్యేయంతో కృషి చేస్తునమన్నారు.
MBNR: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పాత ఆసుపత్రికి తరలించవద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ప్రస్తుత భవనం పార్కింగ్, ఇతర వసతులతో సౌకర్యంగా ఉందని, సొంత భవనం నిర్మించే వరకు దీన్ని మార్చవద్దని ఆయన కోరారు. ప్రజా సౌకర్యార్థం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పునరాలోచించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.