కోనసీమ: ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని బుధవారం ఐఆర్టీఎస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఆలయ అధికారులు వారికి క్షేత్ర విశిష్టతను వివరించారు.
ATP: వేసవి కాలం ప్రారంభం కావడంతో అనంతపురం మార్కెట్‌లో పుచ్చకాయలకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం కిలో పుచ్చకాయ ధర రూ. 20 నుంచి రూ. 25 వరకు పలుకుతోంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు చలవ కోసం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రధాన కూడళ్లలో పుచ్చకాయల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ పాత ట్రస్ట్ ఎదురుగా ఉన్న విజేత మార్ట్‌లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సొళ్ళు పిండి, ఖర్జూరం వంటి పదార్థాలు నాణ్యత లోపంతో పెంకు పురుగులతో ఉండటంతో వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించారు. నాణ్యత లోపించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NLR: రాపూర్ మండలం గండూరుపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ నిమ్మరైతు శ్రీ బి వెంకట్ రెడ్డి పొలాన్ని బుధవారం పొదలకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివ నాయక్ సందర్శించారు. ఏ-వన్ గ్రేడ్, ఏటీఎం మోడల్‌ను సందర్శించి రైతులందరూ కూడా వారితో నిమ్మ తోటను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ… వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
KDP: చెన్నూరు(మం) రుద్రభారతిపేటకు చెందిన దుర్గం దస్తగిరి(37) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దస్తగిరిని ఎవరైనా ఎక్కడైనా చూసి, సమాచారం తెలిసినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.
MBNR: కాంగ్రెస్ పార్టీ 2023 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రత్యేక ఆటో బడ్జెట్ హామీని వెంటనే అమలు చేయాలని దేవరకద్ర ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు రాము డిమాండ్ చేశారు. ఈనెల16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు కేటాయించాలని కోరారు. లేకపోతే ఆటో డ్రైవర్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సభ్యులు రాజు, శేఖర్, నవీన్, కొండారెడ్డి, భీమాచారి తెలిపారు.
BHNG: గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను బొంధుగుల సర్పంచి పయ్యావుల ఎల్లయ్య గ్రామ పెద్దలు కోరారు. బుధవారం ఆయనను కలసి గ్రామంలోని సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లయ్య, ఉపసర్పంచ్ అబిద్ వార్డు సభ్యుడు శీను, రమేష్, గ్రామస్తులు సిద్దులు, రాజు, రాములు, కిషన్, కనుకయ్య, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
NRPT: నార్త్ కరోలినాలో జూలై 17–19 జరగనున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TATA) కాన్ఫరెన్స్‌కు మంత్రి వాకిటి శ్రీహరిని ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో టాటా ప్రతినిధుల బృందం ఆయనను కలిగి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.
PLD: మాచవరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణ చిరంజీవి బుధవారం ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ లక్ష్యంతో రూపొందించిన ఈ రథం ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తుంది. ప్రజలు తమ వద్ద ఉన్న పొడి చెత్తను, పాత సామాగ్రిని రథానికి అందజేస్తే, దానికి ప్రతిఫలంగా వారికి నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
NTR: మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్‌తో కలిసి ఎంపీ కేసినేని చిన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని ఆధునిక స్టేడియంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్లు ఆడే విధంగా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
NTR: చందర్లపాడు పశు వైద్యశాలలో చీడపారుడు నిరోధక టీకాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ డైరెక్టర్ హనుమంతరావు పాల్గొని గొర్రెలు, మేకల పెంపకం దారుల అధ్యక్షులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా మహిళలకు సంఘంలో సభ్యత్వం ఇప్పించి, దాని ద్వారా వచ్చే రుణాలను వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ డీడీ మోజెస్ వెస్లీ పాల్గొన్నారు.
కృష్ణా: పెడన మండలం నేలకొండపల్లి నుండి లంకలాగంట వల్లే రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేలా శ్రీకారం చుట్టారని తెలిపారు. రానున్న రోజుల్లో నూతన రోడ్లతో పాటు, రోడ్ల మరమ్మతు పనులు చేపడతామని స్పష్టం చేశారు.
SDPT: అక్కనపేట మండలంలోనీ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా ట్రైనర్లు సభ్యులకు పాలనా విధానాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సహా పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో పరిశుభ్రత, విద్య, వైద్యం వంటి వాటిపై తరగతులు నిర్వహించారు.
చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నిన్న చంద్రగ్రహణం సందర్భంగా దేవస్థాన అధికారులు ఆలయాన్ని మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి పూజలు చేశారు. ఈరోజు నుంచి ఆలయంలో యథావిధిగా పూజలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో శ్రీగిరి రాజు నర్సింహబాబు తెలిపారు.
PLD: కూటమి ప్రభుత్వం తన ఆస్థులపై దాడి చేసే ప్రయత్నం చేస్తుందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దార్థనగర్‌లోని క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం అంబటి మాట్లాడారు. తనకు సత్తెనపల్లిలో ఉన్న 20 ఎకరాల పొలానికి సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారన్నారు. కృష్ణానది గర్భంలో ఇళ్లు కట్టిన చంద్రబాబు తనను భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు.