• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని’

హన్మకొండ నగరంలోని ఎస్ టీ పీటర్స్ ఫార్మసీ కళాశాలలో సోమవారం జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుబేదారి ఎస్సై ఫణి హాజరై యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే 8712584473కు తెలియజేయాలని, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని సూచించారు.

February 23, 2026 / 04:25 PM IST

కలెక్టరేట్ ముందు కౌలు రైతుల సంఘం ధర్నా

ELR: కౌలు రైతుల రక్షణ కోసం నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందించాలని కౌలు రైతుల సంఘం తెలిపారు. రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు, కౌలు రైతులకు రవాణా కిరాయిలు, హమాలీ చార్జీలు పెంచాలన్నారు.

February 23, 2026 / 04:25 PM IST

‘నిద్రమాను వృక్షాల నరికివేతపై చర్యలు చేపట్టాలి’

BDK: మణుగూరు ఏరియాలో నిద్రమాను వృక్షాల నరికివేతపై అటవీ శాఖ జిల్లా ఫారెస్ట్ ఏవో కే.ఎస్.ఎన్ మూర్తికి సామాజిక సేవకులు కర్నే బాబురావు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సుమారు యాభై సంవత్సరాలు వయసున్న నిద్రమాను చెట్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

February 23, 2026 / 04:25 PM IST

మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ నేతలు

NLR: మెడికల్ మాఫియాను అరికట్టాలని నెల్లూరు కలెక్టరేట్ ఎదుట సీపీఐ నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. ఇన్సూరెన్స్ కంపెనీలను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైద్యం జరుగుతోందన్నారు. పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్తే వ్యాధి గురించి అడగకుండా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని రోగిని అడిగి వైద్యానికి ఉపక్రమించడం సిగ్గుచేటన్నారు.

February 23, 2026 / 04:24 PM IST

స్వగ్రామానికి చేరిన మృతదేహం

NZB: నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లగా గుండె పోటుతో మరణించారు. పది రోజుల తర్వాత రాజు మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరింది. రాజు కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకునేలా చూస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చిన NRIలకు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 04:24 PM IST

‘ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం’

SKLM: ఆరోగ్య సబ్ కమిటీలకు ఎఫ్ఎన్హెచ్‌డబ్ల్యూ పై మందస వెలుగు కార్యాలయంలో సోమవారం మండల పీవో పైడి కూర్మారావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యం పై అవగాహన పెంచడం లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కూరగాయలు, ఆకు కూరలు వినియోగించడం ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చన్నారు.

February 23, 2026 / 04:23 PM IST

మెరుపు సమ్మెకు దిగుతాం: ఆర్టీసీ ఉద్యోగులు

NLR: నెల్లూరులోని ఆర్టీసీ-2 డిపో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఆర్టీసీ-2 డిపోను పినకిల్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ డిపో సెక్రటరీ ప్రసాద్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

February 23, 2026 / 04:21 PM IST

నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడుతా: కవిత

TG: జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జోగులాంబలో రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె.. తన ప్రతి కార్యక్రమాన్ని గద్వాల నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి.. సత్తా చాటుతామన్నారు. ప్రతీ మండలంలో అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు. నడిగడ్డ ప్రజలు నిజాయితీ ప్రజలని చెప్పారు.

February 23, 2026 / 04:21 PM IST

నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడతా: కవిత

TG: జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జోగులాంబలో రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె.. తన ప్రతి కార్యక్రమాన్ని గద్వాల నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి.. సత్తా చాటుతామన్నారు. ప్రతీ మండలంలో అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు. నడిగడ్డ ప్రజలు నిజాయితీ ప్రజలని చెప్పారు.

February 23, 2026 / 04:21 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యం’

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జనతా వారధి అనే కార్యక్రమాన్ని సోమవారం జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

February 23, 2026 / 04:20 PM IST

పోలీస్ క్రీడాకారులను అభినందించిన సీపీ

PDPL: క్రీడలలో ప్రతిభ సాధించిన పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్- 2026లో పాల్గొని బహుమతులు సాధించిన పోలీసులను సోమవారం కమిషనరేట్లో అభినందించారు. విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడలలో రాణించడం గర్వకారణం అన్నారు.

February 23, 2026 / 04:20 PM IST

విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్‌ ఔటింగ్‌

చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా 15 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. దీంతో ముగ్గురు కొట్టుకుపోయారు. అయితే, వారిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరొకరు గల్లంతయ్యారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టినట్లు మహారాష్ట్ర సీఎంవో ప్రకటించింది.

February 23, 2026 / 04:20 PM IST

తిరుపతిలో విలువల విద్యా సదస్సు

TPT: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “విలువల విద్యా సదస్సు”లో ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థుల్లో నైతిక విలువల ప్రాధాన్యంపై ఉపన్యసించారు. జీవితంలో ధర్మం, క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఈవో, అధికారులు హాజరయ్యారు.

February 23, 2026 / 04:19 PM IST

‘రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ’

NRML: రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. అరైవ్ అలైన్ రెండవ దశ కార్యక్రమంలో భాగంగా సోమవారం మామడ మండలంలోని లింగాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు.

February 23, 2026 / 04:19 PM IST

ఆరోగ్యకర జీవనశైలికి పోర్టు పిలుపు

విశాఖ పోర్టు స్టేడియంలో సోమ‌వారం ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్‌ను ఉత్సాహంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఫిట్‌నెస్ ఉద్యమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో వీపీఏ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యం, సక్రియ జీవనశైలిపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

February 23, 2026 / 04:18 PM IST