• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఫిల్లింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన డీజీపీ

HNK: మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌‌ను DGP శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వాహనాల నిర్వహణలో సౌలభ్యం కల్పించడం లక్ష్యంగా ఈ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

March 1, 2026 / 07:06 PM IST

మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి: మంత్రి

కోనసీమ: కె.గంగవరం మండలం మసకపల్లి, సుందరపల్లి గ్రామాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.60 లక్షలు సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న రక్షిత మంచి నీటి పథకంకు ఆదివారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతులు కల్పనకు విశేష కృషి చేస్తున్నామన్నారు. కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం, కోరమండల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

March 1, 2026 / 07:05 PM IST

రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి ప్రశంసలు

TG: సీఎం రేవంత్ రెడ్డిపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశంసల వర్షం కురింపించారు. ‘మునుగోడులో ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో రేవంత్ మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది. బర్రెలు, గొర్రెలు, చేప పిల్లలు ఇచ్చారు. కానీ నాణ్యమైన విద్యను అందించలేదు. విద్య మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్లిపోయింది’ అని అన్నారు.

March 1, 2026 / 07:04 PM IST

3న శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం మూసివేత

PLD: శ్రీ బాల చార్మిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పాల్గొన శుద్ధ పూర్ణిమ కేతు గ్రహ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయము మూసివేయనున్నట్లు సహాయ కమిషనర్ రేఖ తెలిపారు. పునః ప్రారంభం నాలుగవ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ అనంతరం గుడి తెరవబడుతుందని ఆమె అన్నారు.

March 1, 2026 / 07:02 PM IST

5 నెలల పౌండేషన్ కోర్స్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

ఖమ్మం ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఫౌండేషన్ కోర్స్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు SR&BGNR డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. జాకీరుల్లా తెలిపారు. మొత్తం 535 మంది ధరఖాస్తు చేసుకోగా.. 268 మంది హాజరయ్యారని, 267 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్ష ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

March 1, 2026 / 07:02 PM IST

చిరుత దాడిలో మరో లేగ దూడ బలి

KMR: గాంధారి మండలం రామలక్ష్మణపల్లి శివారులో సంగీయా నాయక్‌కు చెందిన లేగ దూడను శనివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది. శనివారం సాయంత్రం కొట్టంలో ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూసే సరికి దూడ చనిపోయింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అడుగులను గుర్తించి చిరుత చంపిందని నిర్ధారించారు. బోన్లను ఏర్పాటు చేస్తామన్నారు.

March 1, 2026 / 07:02 PM IST

అక్రమ ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

KNR: మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు చేపట్టి రాకేష్ రెడ్డి, విజయ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

March 1, 2026 / 07:01 PM IST

‘విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుంది’

PDPL: విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుందని రామగిరి మండలం చందనాపూర్ గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం చందనాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్నవరం, రామప్ప విహార యాత్రకు బయలుదేరగా జెండా ఊపి సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ ప్రారంభించారు.

March 1, 2026 / 07:01 PM IST

ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడిని ఖండించిన సీపీఎం

కృష్ణా: గన్నవరంలో సీపీఎం నేత మల్లంపల్లి ఆంజనేయులు ఇరాన్‌పై జరుగుతున్న సైనిక దాడులను ఖండించారు. అంతర్జాతీయ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వల్ల సామాన్య ప్రజలే నష్టపోతారని అన్నారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 07:00 PM IST

మర్రిపూడి హెడ్ కానిస్టేబుల్ను సత్కరించిన ఎస్పీ

ప్రకాశం: మర్రిపూడిలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన సలీం రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ పోలీసు ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తిచేయడం ఆనందకరమని అన్నారు.

March 1, 2026 / 07:00 PM IST

అనారోగ్యంతో హోంగార్డ్ మహేష్ మృతి

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విసన్నపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కొలికపోగు మహేష్ (40) అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. మహేష్ మరణంతో పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహచరులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 1, 2026 / 07:00 PM IST

‘అమరుల త్యాగాలు చిరస్మరణీయం’

NGKL: మాదిగ జాతి ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగిన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎంఆర్పీఎస్ నాయకులు స్మరించుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో అమరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

March 1, 2026 / 06:59 PM IST

ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన

SRD: విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని,ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఓ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అధ్యయన కేంద్రంలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.

March 1, 2026 / 06:57 PM IST

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

MHBD: గూడూరు మండలం రాములు తండాకు చెందిన భానోత్ నరసింహ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించారు.

March 1, 2026 / 06:57 PM IST

‘గొల్లలకోడేరు కాదు.. వన్ టౌన్ స్టేషనుకు రండి’

W.G: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి, తమ ఫిర్యాదులను నేరుగా వన్ టౌన్ స్టేషన్‌కు రావాలన్నారు.

March 1, 2026 / 06:51 PM IST