• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎమ్మెల్యే పీఎస్ఆర్‌ను కలిసిన నాయకులు

ASF: శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌తో పాటు కాగజ్‌నగర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా, మాజీ చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు జ్యోతి, ఎంజి శారద సంతోష్, వసీమ్ మునీస్ షబీర్, దుర్గం సూరజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.

February 27, 2026 / 08:09 PM IST

‘పారిశుద్ధ్య పనులు.. పరిసరాలు పరిశుభ్రం’

RR: చేవెళ్ల పట్టణంలోని 12వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త చెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు తొలగించి పరిసరాలను శుభ్రపరచారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న కౌన్సిలర్ మనిషా అనంత రెడ్డి వార్డు ఆఫీసర్ చంద్రకాంత్‌తో కలిసి ఈ పనులు చేపట్టడంతో కాలనీవాసులు ప్రశంసలు కురిపించారు.

February 27, 2026 / 08:09 PM IST

జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలకు న్యాయ నిర్ణేతగా గణేష్

VSP: పంజాబ్‌లోని జలంధర్‌లో మార్చి 28, 29 తేదీల్లో జరిగే 15వ జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలకు జిల్లాకు చెందిన కిలాని గణేష్ న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు. వాయుపుత్ర హెల్త్ క్లబ్ చీఫ్ కోచ్‌గా సేవలందిస్తున్న ఆయనకు ఇది ఎనిమిదోసారి జాతీయ స్థాయి బాధ్యత కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక ప్రతినిధిగా ఎంపికైన గణేష్‌ను పలువురు అభినందించారు.

February 27, 2026 / 08:08 PM IST

రేపటి మంత్రి పర్యటన వివరాలు..!

NDL: రేపు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మురళీమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

February 27, 2026 / 08:08 PM IST

సర్పంచ్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

February 27, 2026 / 08:08 PM IST

రెడ్లకుంట చెరువు తూముల పరిశీలన

WNP: ఘనపూర్ మండలం ఆగారం శివారులోని రెడ్లకుంట చెరువు తూములను శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. EE జాబేర్ అహ్మద్ మాట్లాడుతూ.. త్వరలో చెరువు తూములకు మరమ్మతు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో DE సూర్య, AE లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నేత మున్నూరు జయాకర్ తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 08:06 PM IST

నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరిన బండారు

కోనసీమ: ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం పేషీలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలుసుకున్నారు. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని దేవాదాయశాఖ నుంచి దేవాలయాల అభివృద్ధికి, పుష్కరఘాట్ల అభివృద్ధికి, ఆర్అండ్‌బీ శాఖ నుంచి రహదారుల అభివృద్ధికి, పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.

February 27, 2026 / 08:03 PM IST

అంగరంగ వైభవంగా శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం

సిద్ధిపేట మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామంలో ఉన్న శివాలయంలో శివలింగ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. కరీంనగర్కు చెందిన ఓ భక్తుడు శివలింగాన్ని సమకూర్చగా, గ్రామానికి చెందిన భక్తుల సహకారంతో ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

February 27, 2026 / 08:02 PM IST

వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలి: CM

TG: హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీ విషయంలో అత్యాధునిక పరికరాలు ఉపయోగించాలన్నారు. సిగ్నల్ జంక్షన్స్, సర్కిల్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలన్నారు.

February 27, 2026 / 08:02 PM IST

స్కూల్ బస్సు వాహనచోదకులతో అవగాహన కార్యక్రమం

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాలతో స్కూల్ బస్సు వాహనచోదకులతో పట్టణ ఎస్ఐ, MVIలతో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రాణాలు తమ చేతిలో ఉన్నాయని చోదకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వాహనం నడిపినప్పుడు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

February 27, 2026 / 08:01 PM IST

సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు

VZM: చీపురుపల్లి, రావివలస గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఇంఛార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి మరియు ఇతర అధికారులతో భద్రత ఏర్పాట్లును విశాఖపట్నం రేంజ్ ఐజీపీ, గోపీనాథ్ జట్టి శుక్రవారం పర్యవేక్షించారు. సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మీటింగు స్థలం, కార్యకర్తలతో సమావేశ స్థలం, పార్కింగు స్థలాలు, పరిశీలించారు.

February 27, 2026 / 08:00 PM IST

చేపలతో విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ

SKLM: జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో చేపలు రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శుక్రవారం 5 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణా నిపుణులు డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ కోటేశ్వర్‌లు మాట్లాడుతూ.. చేపలతో అనేక ఉత్పత్తుల తయారీ ద్వారా ఆదాయం పెరుగుతుందని మార్కెట్లో డిమాండ్ ఉంటుందని తెలిపారు.

February 27, 2026 / 08:00 PM IST

క్షేత్రపాలకుల ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ త్రిపురాంతక స్వామి (క్షేత్రపాలకులు) ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఐదు రోజులుగా సాగిన శాస్త్రోక్త ఉత్సవాలు ప్రధాన కార్యక్రమాలతో ముగిశాయి. శుభ ముహూర్తంలో ఆలయ ఈవో జె. వెంకటరావు దంపతులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు.

February 27, 2026 / 08:00 PM IST

పాల డైరీ నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని వినతి

CTR: నివాసాల ప్రదేశంలో నిర్మిస్తున్న పాల డైరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆ ప్రాంతవాసులు కోరారు. శుక్రవారం MPDO అప్పాజీకి వినతి పత్రం అందజేశారు. పుంగనూరు మండలం రాంపల్లి సమీపాన గల వెంకటాద్రి కాలనీలో పాల డైరీ నిర్మిస్తున్నారని చెప్పారు. డైరీలో నుంచి బయటకు వచ్చే వ్యర్థపు నీటి వల్ల దోమలు తీవ్రత ఎక్కువ అవుతాయని స్థానికులు తెలిపారు.

February 27, 2026 / 07:59 PM IST

పాఠశాలను సందర్శించిన ఐడీపఎస్ జాయింట్ సెక్రెటరీ

NZB: మోపాల్ మండలం కంజర తెలంగాణ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను పీఎంశ్రీ సభ్యుడు ఐడీఏఎస్ జాయింట్ సెక్రటరీ దేవేందర్ కుమార్ రాయ్ ఇవాళ సందర్శించారు. విద్యార్థినులతో సంభాషించి పాఠశాలలో అమలవుతున్న పీఎంశ్రీ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ విజయ లలితను అభినందించారు.

February 27, 2026 / 07:59 PM IST