• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

LRS స్కీం‌పై టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమావేశం

ATP: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చాంబర్‌లో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ స్కీములపై టౌన్ ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. నిబంధనలు పాటించి పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోనేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

February 20, 2026 / 05:00 PM IST

మహేష్ బాబు అంటే ఇష్టం: టీమిండియా క్రికెటర్

టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే టీ20 ప్రపంచకప్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దూబే మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. మహేష్ బాబు అత్యంత హ్యాండ్‌సమ్ హీరో అంటూ కొనియాడాడు. అలాగే, అల్లు అర్జున్ కూడా తనకు ఇష్టమని, ఆయన నటించిన ‘పుష్ప’ సినిమా బాగా నచ్చిందని పేర్కొన్నాడు.

February 20, 2026 / 05:00 PM IST

సీఎం సహాయని చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో తాజాగా 36 మందికి రూ.16,24,276లు ఆర్థికసాయం తాజాగా మంజూరైంది. మైలవరం, గొల్లపూడి గ్రామాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు చెక్కులు రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధిని శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అన్నారు.

February 20, 2026 / 04:58 PM IST

కొర్రపాడులో పశు వైద్య శిబిరం నిర్వహణ

KDP: రాజుపాలెం(M) కొర్రపాడులో శుక్రవారం ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇందిర ఆధ్వర్యంలో గైనకాలజీ, మెడిసిన్, ఆపరేషన్ ఇతర 40 కేసులకు సంబంధించి చికిత్సలు అందించారు. పశువుల వ్యాధి నివారణకు డీ-వార్మింగ్, డీ-టికింగ్ నిర్వహించారు. పశుపోషణ, వ్యాధులపై, చికిత్సలపై రైతులకు అవగాహన కల్పించారు.

February 20, 2026 / 04:56 PM IST

శ్రీవారితో ప్రభుత్వం పాలిటిక్స్ చేస్తుంది: బొత్స

AP: వేంకటేశ్వరస్వామితో కూటమి పార్టీలు పాలిటిక్స్ చేస్తున్నాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందన్న చంద్రబాబు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మండలిలో ఎక్కడా తమ సభ్యులు చెప్పులు ధరించలేదని చెప్పారు.

February 20, 2026 / 04:56 PM IST

బండలాగుడు పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే

RR: కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. కేశంపేట మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోటీలో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

February 20, 2026 / 04:54 PM IST

గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచం: ఏసీపీ

SDPT: హుస్నాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో ఎస్సై లక్ష్మారెడ్డి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 04:53 PM IST

ఖర్గేను కలిసిన చిన్నారెడ్డి

TG: AICC చీఫ్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేళ వనపర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంను తాను వెనక్కి ఇచ్చే సమయంలో తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని చిన్నారెడ్డి AICC చీఫ్ ఖర్గే దృష్టికి తెచ్చారు.

February 20, 2026 / 04:53 PM IST

బాలీవుడ్‌లోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ..!

ప్రముఖ నటి మీనాక్షి చౌదరి బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భాగమ్ భాగ్’కు సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో మీనాక్షితో పాటు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించనున్నాడు.

February 20, 2026 / 04:53 PM IST

ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం: SWF

KRNL: విలువైన ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం అంటూ శుక్రవారం కర్నూలు ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 11,000 రెగ్యులర్ కార్మికుల పోస్టులను రిక్రూట్‌మెంట్ ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

February 20, 2026 / 04:51 PM IST

విద్యార్థులకు పెన్నులు అట్టలు పంపిణీ

AKP: కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు శుక్రవారం పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. హెచ్ఎం సుకుమార్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు వారి చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 04:50 PM IST

జైభీమ్ ఎమ్మార్పీఎస్ నేతకు పరామర్శ

KRNL: ఆదోనిలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ మాదాసుల రాజబాబు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆయన ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

February 20, 2026 / 04:49 PM IST

‘బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు’

NZB: బాల్య వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల పరిరక్షణ అధికారి నాగేరి బాబు హెచ్చరించారు. శుక్రవారం రుద్రూర్ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే తల్లిదండ్రులతో పాటు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.

February 20, 2026 / 04:49 PM IST

ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: రెవెన్యూ శాఖకు బడ్జెట్ కేటాయింపులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడారు. 22వ నిషేధిత జాబితా భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22ఏ భూముల తొలగింపు సులభతరం చేసేలా అధికారులను బదలాయింపు చేస్తున్నట్లు వెల్లడించారు. జాబితా నుంచి ప్రైవేట్ భూములు తొలగించే అధికారం ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు ప్రకటించారు.

February 20, 2026 / 04:48 PM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు!

PDPL: మంథని మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:47 PM IST