AKP: చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీపై శుక్రవారం పాయకరావుపేట తాండవ రైతు ఉత్పత్తిదారుల సంఘం కార్యాలయంలో శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఎలమంచిలి కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎస్ మీనాక్షి మాట్లాడుతూ.. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. వీటి తయారీకి తక్కువ ఖర్చు అవుతుందని అన్నారు.
HYD: పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్‌సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరా కఠిన చర్యలు తీసుకుంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే బ్లాకులను విక్రయానికి పెట్టినందుకు సదరు ప్రమోటర్‌పై రూ. 43.71 లక్షల ఫైన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అలాగే నిర్మాణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది.
కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని రెగ్యులేటర్ పునప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం ఉదయం 10 గంటలకు పాల్గొంటారని ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం ఆరుగొలును గ్రామంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.
ATP: రాయలసీమ హక్కుల సాధన కోసం మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సీమను మోసం చేసేవారికి ఇది హెచ్చరిక అని పేర్కొంటూ, హక్కుల కోసం సమరం తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రేపు ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో బంగ్లా తలపడనుంది. సెమీస్‌లో SLను IND, PAKను BAN ఓడించి ఈ తుదిపోరుకు చేరాయి. అయితే 2023 టోర్నీలోనూ ఇలాగే సెమీస్, ఫైనల్ ఇవే జట్ల మధ్య జరిగింది. నాటి టైటిల్ పోరులో బంగ్లాపై భారత్ 31 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సారీ అలాగే ప్రత్యర్థిని రాణించాలని యువ భారత్ భావిస్తోంది.
NZB: 2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
SDPT: మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 17వ తేదీన రైతుబంధు విడుదల చేస్తానని సీఎం రేవంత్ చెప్పారని, 20వ తేదీ వచ్చినా ఇప్పటికీ నిధులు జమ కాలేదని హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడా?, కోతల సమయంలోనా? ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పంటలకు ఇవ్వలేదని, ఈసారి అయినా విడుదల చేస్తారా? అని నిలదీశారు.
SKLM: జలుమూరు మండలంలోని శ్రీ ముఖలింగేశ్వరుని ఆలయంలో హుండీ ఆదాయాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఏడుకొండలు పర్యవేక్షణలో శుక్రవారం లెక్కించారు తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం జరిగినట్లు ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. రూ. 7.31 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.
KNR: కరీంనగర్‌లో ఎన్నికల హామీని నెరవేర్చిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన మాడిశెట్టి రవీందర్ కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.25,000 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హామీని అమలు చేశామన్నారు.
GNTR: ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం కృష్ణా డెల్టా పంట కాలువలకు మొత్తం 2,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో కృష్ణా పశ్చిమ కాలువకు 2,212, తూర్పు కాలువకు 502, మరియు గుంటూరు ఛానల్‌కు 144 క్యూసెక్కుల నీటిని కేటాయించారు. అలాగే తూర్పు కాలువ ద్వారా కేఈబీకి 302, బందరు కాలువకు 200 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.
AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ ముగించింది. సుదీర్ఘంగా 6 ఏళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ తుది నివేదికను కోర్టుకు సమర్పించగా, కోర్టు దాన్ని ఆమోదించి కేసును మూసివేసింది. 2019లో రీపోస్టుమార్టం కోసం వెలికితీసిన ఆయేషా శరీర అవశేషాలకు ఈ నెల 27న ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.
NLG: జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మామిడాలలో అప్పుల బాధతో సంతోష్ ఉరివేసుకోగా, తిట్టకుంటలో మానసిక స్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేష్ గడ్డిమందు తాగి మృతి చెందాడు.
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 67.226 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 908 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 262 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.
RR: నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో కాంగ్రెస్ నాయకుడు మాణిక్యం మత సామరస్యాన్ని చాటుకున్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని మసీదు అభివృద్ధి కోసం ఆయన రూ. 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. సర్పంచ్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని మైనార్టీ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ, భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.