CTR: కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయంలో అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోజు ఉ. 6 గంటలకు సుప్రభాత సేవ, 8 గం.కు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, 11 గంటల వరకు సర్వదర్శనం ఉంటుందన్నారు. అనంతరం 11 గంటలకు శుద్ధి, 11:30 నుంచి సాయంత్రం 4 వరకు సర్వదర్శనం కొనసాగుతుందన్నారు.
NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా గోమతి నగర్ ప్రాంతంలోని ప్రధాన డ్రైను కాలువను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. డ్రైన్ కాలువలో మురుగునీరు ప్రవాహానికి అడ్డంకి లేకుండా పూడికతీత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
NTR: స్వస్త్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా నందిగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు వారి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్త దానం చేయడం వలన మరొకరికి ప్రాణదానం చేయగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్.సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
WGL: ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు పట్టణాలుగా మారుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలు గ్రామస్తులు తదితరులున్నారు.
HYD: టీవల కురుస్తున్న భారీ వర్షాలకు బల్కంపేట నుంచి బేగంపేట్ వెళ్లే అండర్ పాస్ బ్రిడ్జి కింద వరదల్లో చిక్కుకొని తాజాగా ఓ యువకుడు మరణించిన విషయం తెలిసిందే. కాగా, పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ కోట నీలిమ స్పందించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా అధికారులు రాత్రింబవళ్ళు పని చేస్తున్నారని పేర్కొన్నారు.
CTR: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెకు చెందిన రోజా 2022లో బీఎస్‌ఎఫ్ జవానుగా ఎంపికయ్యారు. పంజాబ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె.. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధుల్లో ఉన్నారు. జవానుగా దేశ సరిహద్దుల్లో రక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తూనే.. మెగా DSC కోసం కష్టపడి చదివింది. ఈ మేరకు డీఎస్సీ పరీక్షలో 83.16 మార్కులు సాధించి ఉపాధ్యాయురాలైంది.
కాకినాడ: తుని మండలం కొత్త సురవరంలో శుక్రవారం తుని రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో రాష్ట్రీయ పోషణ మాస ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 16 తేదీ వరకు జరుగుతాయని పీవో శ్రీలత తెలిపారు. 6 సంవత్సరాలలోపు పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ మారుతీనగర్‌కు చెందిన శ్రీరామోజు రఘు ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని నమ్మిన సైబర్ మోసగాళ్లకు రూ. 93 వేల వరకు మోసపోయాడు. మొదట రూ. 20 వేల ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత మరో దశల్లో డబ్బులు పంపాడు. లాభాలు రాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్రీటౌన్ సీఐ కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ రాఘవ కుమార్ శుక్రవారం రాజోలు ఆర్టీసీ డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల వసతులు, టాయిలెట్లు, త్రాగునీరు, పరిసరాల శుభ్రత, సమాచార కేంద్రం వంటి సదుపాయాలను తనిఖీ చేశారు. ముఖ్యంగా బస్సుల కండిషన్ పరిశీలించారు. అలాగే కండక్టర్లు, డ్రైవర్లు సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
TPT: శ్రీసిటీ DSPగా శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా ఉన్న ఆయన ఇటీవల పదోన్నతి పొందారు. దీంతో ఈ నెల 17న ఆయన్ను శ్రీసీటి డీఎస్పీగా నియమిస్తూ డీజీపీ ఆఫీసు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.
TG: CM రేవంత్ రెడ్డితో ఢిల్లీలో US న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డీ.మర్ఫీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ విజన్-2047 సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మర్ఫీకి రేవంత్ తెలియజేశారు. ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణ ...
NDL: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నంద్యాల మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్న నంద్యాల YCP యువజన, విద్యార్థి విభాగాల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఖండించారు.
ATP: సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.
SRD: పుల్కల్ మండలం సింగూరు జలాశయంలో 50 వేల క్యూసెక్కులు వరద చేరుతున్న దృష్ట్యా, దిగువకు 60 వేల క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నట్లు IB EE బీమ్ శుక్రవారం మధ్యాహ్నం తెలిపారు. ప్రస్తుతం 6 గేట్ల ద్వారా నీరు విడుదలవుతుండగా, మరో గేటు ద్వారా దిగువకు విడుదల చేస్తామన్నారు. అందుకని మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
W.G: శాసనమండలి సమావేశాల్లో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి కారుణ్య నియామకాలపై ప్రశ్నించారు. కరోనా కాలంలో ఎంతో మంది ఉపాధ్యాయులు మరణించారని, 3252 మెమోను సవరించి మరణించిన వారి కుటుంబాలకు ఖాళీలు ఉంటే అక్కడ ఉద్యోగులను నియమించాలన్నారు. అలాగే మోడల్ స్కూల్లో 17 మంది వరకు చనిపోయారని వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని కోరారు.