SKLM: నరసన్నపేట ప్రధాన రహదారిలోని వీధిలైట్లు వెలగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులుగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కళాశాల జంక్షన్ వరకు వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన రహదారి చీకటమయంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
NRML: సోన్ వద్ద గోదావరి నది ఉరకలేస్తూ ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు రావడంతో, ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలగా పుష్కర ఘాట్లను తాకుతూ గోదావరి నది ఉరకలేస్తూ ఉదృతంగా ప్రవహిస్తుంది. గోదావరి అందాలను పలువురు సెల్ ఫోన్లలో బందిస్తున్నారు.
VSP: రుషికొండ బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. పీఎం పాలెం ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయితో పాటు మరో ఇద్దరు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. ఇద్దరిని మెరైన్ పోలీసులు, లైఫ్ గాడ్స్ కాపాడారు. సంజయ్, సాయి అచూకీ ఇంకా లభ్యం కాలేదని పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.
NLG: తల్లి మందలించిందని మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు సేవించి మృతి చెందింది. మునుగోడు ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులకు వెళ్లాలని తల్లి మందలించగా.. మునుగోడు మండలం చెల్మెడకు చెందిన యువతి కొంక భవాని (25) పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
SKLM: కవిటి మండలం రాజపురం పంచాయతీ తొత్తిడి పుట్టుగ గ్రామంలో ఆదివారం ఎంపీ నిధులతో నిర్మితమైన నూతన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే అశోక్ బాబును, జనసేన ఇన్‌ఛార్జ్ రాజును ఘనంగా సన్మానించారు.
NZB: ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామ శివారు 44వ జాతీయ రహదారిపై ఆదివారం నారింజ పండ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపైన వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
MNCL: తాండూరు మండలంలోని చంద్రపల్లి గ్రామంలో VRA గా విధులు నిర్వహిస్తున్న బురుస శంకర్ (55) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల తహసీల్దార్ జ్యోష్ణ, డీటీ కల్పన, ఆర్ఐలు పద్మజా, ఎజాజోద్దీన్, సిబ్బంది, తోటి వీఆర్ఏలు సంతాపం తెలిపి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
AKP: మారేపల్లిలో దుర్వాసన కక్కిన కోళ్ల కళేబరాలను ఎవరూ తాకకపోవడంతో హరితరాయబారులే రంగంలోకి దిగారు. కాలువలోని కోళ్ల వ్యర్థాలను బయటకు తీసి గోతుల్లో పూడ్చారు. చెత్త వేరు చేయడం, రోడ్లు ఊడవడం చేస్తూ.. తక్కువ జీతాలతో కష్టపడుతున్న వీరిని ఇలాంటి ప్రమాదకర పనులకు వినియోగించడంపై పలువురు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
HYD: నగరంలో కాసేపట్లో పలు ఏరియాల్లో భారీ కుండపోత వర్షం కురువనుందని TGDPS తెలిపింది. షేక్‌పేట్, మణికొండ, గచ్చిబౌలి, నార్సింగి, నానక్ రాం గూడ, రాయదుర్గం, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్, కూకట్‌పల్లి, అమీర్పేట, సనత్ నగర్లో వర్ష బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
KMR: కామారెడ్డిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేక రామచంద్రం పదవీ విరమణ కార్య క్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. పదవీ విరమణతో విశ్రాంతి తీసుకోవాలని ప్రతి ఒక్కరి జీవితంలో పదవీ విరమణ తప్పనిసరి అన్నారు. విద్యార్థుల గుండెల్లో నిలిచిన ఆయన చేసిన విద్యా బోధనలను ఎమ్మెల్యే కొనియాడారు.
SKLM: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ప్రధాన రోడ్డు వెంబడి సీరియల్ లైటింగ్, డెకరేషన్, ఎగ్జిబిషన్ సెంట్రల్ లైటింగ్ పనులు ఊపందుకున్నాయి.
NLR: మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ ఇన్ ఛార్జ్ ప్రిన్సిపాల్ పెత్తన స్వామిని విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవోదయ కళాశాలకు సస్పెండ్ కాపీని అధికారులు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడడంలో ఆలస్యం ఉండదని, ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఇంటికి పంపిస్తామని కలెక్టర్ నిరూపించారు.
CTR: తిరుపతి పర్యటన అనంతరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతికి పూతలపట్టు MLA డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్ధప్రసాదాలతోపాటు చిత్రపటాన్ని బహూకరించారు.
NLG: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా MVN విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ స్ఫూర్తి’ అనే అనే అంశంపై కవి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన కేంద్రం కన్వీనర్ డా. అక్కెనపల్లి మీనయ్య అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి రచయిత డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
GNTR: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57ను అమలు చేయాలని కోరారు. 12 వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఐఆర్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.