అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నేతల దాడిని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఖండించారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ఇక్కడ దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. దేశంలో ప్రశ్నించే హక్కును బీజేపీ కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.
TG: నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) అగ్నిప్రమాదం ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 1,100 ఫైల్స్ పూర్తిగా దగ్ధమైనట్లు నాగ్‌పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఈ కేసుల డేటాను రికవరీ చేసేందుకు నిపుణులు ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కీలక ఆధారాలు ఉన్న ఫైల్స్ కాలిపోవడం ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారింది.
W.G: ఉగాది వేళ డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 900 పైచిలుకు పోస్టులు భర్తీ కాగా, తాజాగా మరో 200 ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో ప.గో. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కు మరింత పదును పెడుతున్నారు.
VZM: బొబ్బిలి (M) కోమటిపల్లిలో విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న కేసులో 11మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఓ మైనర్ బాలుడు, 7గురు విద్యార్థులు ఉండటం కలకలం రేపింది. కాలేజ్ సమీపంలో గంజాయి విక్రయాలు జరగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి అమ్మకాలు విక్రయిస్తున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అన్నమయ్య: రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ పాల్గొన్నారు. జనగణన ఏర్పాట్లపై కేంద్ర అధికారులు మార్గదర్శకాలు అందించగా, జిల్లా స్థాయిలో ముందస్తు సిద్ధతపై కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు విభాగాల సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే తరఫున RRB శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు 10, ITI/డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు కాగా.. వీటిల్లో 674 సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉండటం విశేషం. CBT 1 & 2, CBAT, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
KRNL: ఆదోని(M) కపటి గ్రామంలో ఆస్తి తగాదాతో కొడుకు తన తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు SI మహేశ్ తెలిపారు. అనంతరం ఇంట్లోని ఐదు తులాల బంగారం, బుల్లెట్ బైక్‌తో పరారయ్యాడని చెప్పారు. గాయపడిన తండ్రిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
E.G: దేవరపల్లిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల సత్తిబాబు, టీడీపీ మండలం అధ్యక్షులు తంగేళ్ల మునీశ్వర రావు శనివారం ప్రారంభించారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రజల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్వీకరించి వాటి విలువను తగ్గట్టుగా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీనిని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
KNR: కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ కళాశాలలోని ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ (EDC) ఆధ్వర్యంలో ఎంటర్ప్రైన్యూర్షిప్ స్ఫూర్తిని పెంపొందించడంపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి దిశగా ఆలోచించాలని సూచించారు.
ATP: వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సంయుక్త కార్యదర్శిగా పుట్లూరు మండలానికి చెందిన యువనేత శ్యామ్ సుందర్ రెడ్డి బెడదల నియమితులయ్యారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న చొరవను గుర్తించి అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. తన నియామకానికి సహకరించిన పార్టీ ముఖ్య నేతలకు శ్యామ్ సుందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
SRCL: వాకింగ్, వ్యాయామం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట వ్యాయామం, నడక అలవాటు చేసుకోవాలని అన్నారు. సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని పేర్కొన్నారు.
BDK: అశ్వాపురం మండలం మండికుంట గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ శనివారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన సీఐ అశోక్ రెడ్డి ఘటన స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
KMM: పొన్నెకల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్న ఒక నిరుపేదకు తొమ్మిది లక్షల ప్రభుత్వ ఎల్వోసీ మంజూరు చేయించి కొండంత భరోసా ఇచ్చారు. తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం రాత్రి లబ్ధిదారులకు LOC పత్రాని అందజేశారు.
RR: చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న షాద్‌నగర్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 129 మంది స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఏప్రిల్‌లో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా ముగియనుంది. మార్చిలో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.