• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఉయ్యాలవాడ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం’

SKLM: మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 175వ వర్ధంతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు హాజరై, నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి తరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని అన్నారు.

February 22, 2026 / 04:03 PM IST

ఆదర్శంగా నిలిచిన యువకులకు ప్రశంసలు

SDPT: ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జానపద గాయకుడు ఇట్టబోయిన స్వామి, కానిస్టేబుల్ దయ్యాల లక్ష్మణ్‌ను ఘనంగా సత్కరించారు. సోషల్ మీడియాలో ‘గుజారి’ పాటతో స్వామి 5 మిలియన్ల వ్యూస్ సాధించగా, బాడీ బిల్డింగ్లో లక్ష్మణ్ స్టేట్ సెకండ్ సాధించారు. ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వీరి విజయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.

February 22, 2026 / 04:00 PM IST

మూడో రోజుకు చేరిన రైతు సంఘం సామూహిక దీక్షలు

ATP: హంద్రీనీవా సాగునీటి జలాల సాధనే తమ ప్రధాన లక్ష్యం అని రైతు సంఘం నాయకులు గోవింద్ పేర్కొన్నారు. గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో చెరువులకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణ జలాలు మళ్లించడానికి నిధులు కేటాయించాలని గత రెండు రోజులుగా చేస్తున్న సామూహిక దీక్షలు ఆదివారం మూడో రోజుకు చేరాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

February 22, 2026 / 04:00 PM IST

‘రేపు పాడా కార్యాలయంలో PGRS కార్యక్రమం’

KKD: పిఠాపురం ప్రాంతాభివృద్ధి సంస్థ (పాడా) కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. బాధితులు ప్రత్యక్షంగానే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని ఆయన సూచించారు.

February 22, 2026 / 04:00 PM IST

త్వరలోనే రూ.20,737 కోట్లతో RRR పనులు

SRD: రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం పనులకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లా తంగడ్‌పల్లి వరకు 161.5 కి.మీల మేర 6వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేగా దీనిని నిర్మించనున్నారు. ఈ రహదారికి ఎన్హెచ్-161AAగా నామకరణం చేస్తూ రూ.20,737 కోట్లు కేటాయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.

February 22, 2026 / 04:00 PM IST

జిల్లా ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్న రోజులు.!

BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత నాలుగు రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాష్‌ రూమ్‌లలో నీరు లేక దుర్వాసన వ్యాపించడంతో రోగులు ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన పై అధికారులు స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

February 22, 2026 / 03:58 PM IST

అభిషేక్ శర్మపై అమీర్ హాట్ కామెంట్స్

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ గుడ్డిగా బ్యాటింగ్ చేస్తాడని విమర్శించాడు. బంతి స్లాట్‌లో పడితే తప్ప అతడు షాట్లు ఆడలేడని, ఆఫ్ సైడ్ వచ్చే బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటం అతడి బలహీనత అని పేర్కొన్నాడు. అభిషేక్ తన ఆటతీరును మెరుగుపరుచుకోకపోతే, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం కొనసాగలేడని హెచ్చరించాడు.

February 22, 2026 / 03:57 PM IST

రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు రెరా వార్నింగ్‌

TG: ఇళ్లు/ఫ్లాట్‌ విక్రయాల కోసం రిజిస్ట్రేషన్‌ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని సంస్థలను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించినా, యూనిట్ల సంఖ్య 8 కంటే ఎక్కువగా ఉన్నా సంబంధిత ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయించాలని సూచించింది.

February 22, 2026 / 03:56 PM IST

ఆర్చరీ టోర్నమెంట్‌ను ప్రారంభించిన కలెక్టర్

NTR: విజయవాడలో 3వ NTPC ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ మహిళల ఆర్చరీ టోర్నమెంట్‌ను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తొలి బాణాన్ని విడుదల చేసి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆర్చర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నమెంట్ ద్వారా యువ క్రీడాకారులకు తమ ప్రతిభను కనబరిచే మంచి వేదిక అన్నారు.

February 22, 2026 / 03:56 PM IST

దుర్గ చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులు

చిత్తూరు న్యూ రాజీవ్ కాలనీలో దివంగత TDP నాయకురాలు దుర్గ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనుబంధ కమిటీల సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 03:53 PM IST

నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహణ

ప్రకాశం: కొండేపిలోని బీసీ కాలనీలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండేపి సీఐ సోమశేఖర్, వారి సిబ్బందితో కాలనీలోని ప్రతి ఇంటిని, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 33 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 22, 2026 / 03:52 PM IST

తోట్లవల్లూరులో ప్రజల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం

కృష్ణా: తోట్లవల్లూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం ఆదివారం జరిగింది. తోట్లవల్లూరు గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు బొడ్డు నితీష్ నేతృత్వంలో గ్రామస్థుల నుంచి సూచనలు, సమస్యలు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, ఉపాధి వంటి అంశాలపై ప్రజలు తమ విన్నపాలు తెలిపారు.

February 22, 2026 / 03:51 PM IST

కేంద్రని కలిసిన కలెక్టర్, ఎస్పీ

GDWL: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆదివారం అలంపూర్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎస్పీ మంత్రికి వివరించారు.

February 22, 2026 / 03:51 PM IST

‘దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి’

PLD: ఏపీలో కాంగ్రెస్ ఆఫీసులపై ఏబీవీపీ దాడులను సత్తెనపల్లి పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్ఞాన్ రాజ్ పాల్ ఖండించారు. ఆఫీసుల్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనాగరికమన్నారు. ఢిల్లీ ఏఐ సదస్సులో మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తే ఆంధ్రాలో దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 03:51 PM IST

నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డితో కలిసి కొత్త వెల్లంటి, పాత వెల్లంటి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రీ ఫేజ్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

February 22, 2026 / 03:50 PM IST