• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Revanth Reddy: కేసీఆర్ రాక్షస పాలనలో మరో నిరుద్యోగి బలి

తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) రాక్షస పాలనతో రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1కు ప్రిపేరైన సిరిసిల్లకు(sircilla telangana) చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

March 18, 2023 / 11:48 AM IST

Bus Accident: కశ్మీర్‌లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి, 28 మందికి గాయాలు

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా(Kashmir pulwama district)లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 28 మంది గాయపడ్డారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా(bus accident) పడినట్లు తెలుస్తోంది.

March 18, 2023 / 11:36 AM IST

Fire Accident : నగరంలో మరో అగ్నిప్రమాదం..!

Fire Accident : హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైద‌రాబాద్‌లోని రాజేంద్ర న‌గ‌ర్ లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ అగ్ని ప్ర‌మాదంలో మంట‌లు ఎగసిప‌డ్డాయి. రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని శాస్త్రీపురంలో ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ప్లాస్టిక్ గోదాములో మంట‌లు ఎగ‌సిప‌డుతున్నాయి.

March 18, 2023 / 11:18 AM IST

Mahila commission విచారణకు బండి సంజయ్, లీగల్ టీమ్ సహా లిస్ట్

Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.

March 18, 2023 / 11:27 AM IST

Breaking: లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరు మృతి

ఏపీ(ap)లోని ఎన్టీఆర్ జిల్లా(ntr district)లో విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహింపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో(Vijayawada Thermal Power Station) లిఫ్ట్ వైరు తెగిన(lift wire breaking) ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

March 18, 2023 / 12:30 PM IST

Khammam News : పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ..

Heart Attack : డీజే సౌండ్‌ కారణంగా ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా అల్లీపురంలో బంధువుల పెళ్లి ఊరేగింపులో డాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రాణి అనే మహిళ. పెళ్ళి ఊరేగింపులో డీజే శబ్దాల దాటికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రాణీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

March 18, 2023 / 10:33 AM IST

TDP Win: ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ 2 స్థానాల్లో విజయం

ఏపీ(AP)లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ(TDP) అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు శుక్రవారం రెండో ప్రాధాన్యత లెక్కింపులో 94,510 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన టీడీపీ అభ్యర్థి.. కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ మీద ఘన విజయం సాధించారు.

March 18, 2023 / 10:32 AM IST

KTR : బండి సంజయ్ కి మతిలేదు… కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

KTR : బండి సంజయ్ కి మతి లేదని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను కేటీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ప్ర‌భుత్వ‌ వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిప‌డ్డారు.

March 18, 2023 / 10:18 AM IST

Virat Kohli Biopic: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ చరణ్?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(ram charan) విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పోర్ట్స్ బయోపిక్‌(Biopic)లో పనిచేయాలని ఉందని తన కోరికను వ్యక్తపరిచాడు. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తెలిసిన విరాట్, చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2023 / 10:22 AM IST

Pawan Kalyan : అగ్ని ప్రమాదంపై పవన్ రియాక్షన్ ఇదే….!

Pawan Kalyan : స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటన ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను ఆందోళన కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు అగ్నిప్రమాద ఘటనల్లో పలువురు మృతి చెందగా..తాజాగా సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో ఆరుగురు సజీవ దహనమయ్యారు.

March 18, 2023 / 10:00 AM IST

Ramcharan: హైదరాబాద్ చేరుకున్న చెర్రీ..అర్థరాత్రి పోటెత్తిన ఫ్యాన్స్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్(ram charan) చరణ్ పలు అవార్డుల కార్యక్రమాల తర్వాత శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు(reached hyderabad). ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్ పోర్టు(begumpet airport)లో చరణ్ కు అభిమానులు గ్రాండ్ వెలకమ్ చెప్పారు. పూలు పెద్ద ఎత్తున జల్లుతూ సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు.

March 18, 2023 / 09:30 AM IST

Minister Guggana: మద్యం సేల్స్ తగ్గించేందుకే రేట్లు పెంచాం

మద్యం వినియోగం తగ్గించడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(ap government) మద్యం ధరలను(liquor prices) పెంచినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(minister buggana rajendra prasad) తెలిపారు. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఆల్కహాల్ వినియోగం 38 శాతం తగ్గినట్లు వెల్లడించారు. మరోవైపు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల కంటే ఏపీలో ఆర్థిక లోటు మెరుగ్గా ఉందని బుగ్గన స్పష్టం చేశారు.

March 18, 2023 / 08:55 AM IST

Rain News: తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రెండు రోజులు వానలు!

తెలుగు రాష్ట్రాల్లో(telangana, ap) మరో రెండు రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే(rain fore cast) అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండురోజులుగా తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల వర్షం కురిసింది.

March 18, 2023 / 08:07 AM IST

Amit Shah: ఇద్దరు లెజెండ్ సినిమా హీరోలను కలిశా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)ను ఢిల్లీ(delhi)లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్‌(ram charan) శుక్రవారం రాత్రి కలిశారు. ఆ క్రమంలో అమిత్ షా చెర్రీకి శాలువా కప్పి సత్కరించారు. RRR చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. అంతేకాదు ఇద్దరు లెజెండ్ హీరోలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

March 18, 2023 / 07:27 AM IST

PM MODI : తెలంగాణకు కేంద్రం శుభవార్త.. త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు..

తెలంగాణతో (Telangana) సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను(Mega Textile Park) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇంకా ఈ పార్కుల ద్వార...

March 17, 2023 / 10:10 PM IST