తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు వరించనుంది. సినీ నటుడిగా సమాజానికి, రాజకీయ వేత్తగా ప్రజలకు సేవ చేసినందుకు అవార్డు ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందట. ఈ అంశం గురించి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని చాలా రోజుల నుంచి టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరు...
నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో ...
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. వారిపై విమర్శల వర్షం కురిపించారు. కమీషన్ల కోసమే కాఫర్ డ్యాం లేకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆరోపించారు. ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించడం, వాటాలు కొట్టేయడం, దోపిడీలు చేయడం, దొడ్డిదారిన పదవులు చేపట్టడం మీకు, మీ కుమారుడికి అలవాటే అన్నారాయన. నేను మీకన్నా వంద రెట్లు నిజాయితీపరుడ్ని గుర్తుపెట్టుకో...
ఖమ్మంలో నిర్వహించిన తమ బీఆర్ఎస్ పార్టీ సభ విజయవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు లక్షలాదిగా హాజరయ్యారని ఆయన చెప్పారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రితో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. మైదానంలో చిన్నపాటి సముద్రం కనిపించిందన్నారు. మైదానం సరిపోక బయటే లక్షమంది దాక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండిపోయారని తెలిపారు మంత...
జీవో నెంబర్ 1 పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్పులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రోడ్ల పైన సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిప...
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆయనపై చర్చలు తీసుకోవాలని రెజ్లర్లు వరుసగా మూడో రోజు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఇది రాజకీయ కుట్రలో భాగమని, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి అన్నీ బయటపెడతానని బ్రిజ్ భూషణ్ తెలిపారు. రెజ్లర్ల నిరసన తీవ్రం కావడంతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రంగ...
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మంగళ్‌హాట్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని సయ్యద్ మహమూద్ అలీ గతేడాది ఆగస్టులో కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కంచన్ బాగ్ నుంచి మంగళ్‌హాట్ స్టేషన్ మార్చారు. తాజాగా ఇచ్చిన నోటీసులపై రాజా సింగ్ స్పందించారు. పోలీసులు తనను అరెస...
ఏపీఎస్ ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ నెల 18న ఒక్కరోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. ఇందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో రికార్డుస్థాయి ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే గతంలో మాదిరి టిక్కెట్ ధరలను 50 శ...
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సభలు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మొదటి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ కాపు నేత తోట చంద్రశేఖరరావును ఏపీ బీఆర్ఎస్ చీఫ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సభను ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సభ ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరల...
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాం గోపాల్ పేట అగ్నిప్రమాదం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్కార్ వద్ద డబ్బులు లేవని, అందుకే అక్రమంగా భవనాలకు పర్మిషన్ ఇస్తుందని తెలిపారు. ప్రమాదానికి గురయిన దక్కన్ మాల్ భవనాన్ని ఈ రోజు (శుక్రవారం) కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సహకారాలు అందించాలని కోరారు. కాలిపోయిన భవాన్ని కూల్చివేయాలన్నారు. ఆ భవనాలను కూల్చివేసే సమయంలో చుట్టుపక్కల ...
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ గురువారం క్షమాపణలు చెప్పారు. కారు ప్రచార వీడియోలో ఆయన సీటు బెల్ట్ ధరించలేదు. దీంతో తన సీటు బెల్ట్‌ను తొలగించి తప్పు చేశానని అంగీకరించారు. నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియా వీడియో చిత్రీకరణ కోసం ఆయన తన సీట్ బెల్ట్ తొలగించారు. బ్రిటీష్ చట్టాల ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు సీటు బెల్ట్ ధరించనందుకు డ్రైవర్లు, ప్రయాణీకులకు 500 పౌండ్ల వర...
మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా కామెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆ కుటుంబం నుంచి ఏడుగురు వరకు హీరోలు ఉన్నారని, అందుకే చిన్న ఆర్టిస్టులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ చెప్పినట్టు అంతా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కామెంట్లపై నటుడు బ్రహ్మజీ కౌంటర్ ఇచ్చారు. ‘తనను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కోరలేదు? పార్టీలో చేరమని అడగలేదు? చిన్న ఆర్టిస్టులు ఎందుకు భయపడతారు’ అని ...
కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్...
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఆ మాటే మరిచారని ధ్వజమెత్తారు. జనాలకు కబుర్లు చెప్పి అధికారం చేపట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండబోదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నే చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని వెలగబెడతారా అని స...
షారూక్ ఖాన్ సినిమాను బైకాట్ పఠాన్ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా నిరసనలు, సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. సినిమాను నిషేదించాలని, పాటలో సీన్‌ను తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గతంలోను ఇతర నటుల సినిమాలకు బైకాట్ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యం...