• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆ వాహనదారులకు టోల్ ఫీజు రీఫండ్!

ముంబై-పుణె ఎక్స్‌‌ప్రెస్‌వేపై ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న వాహనదారులకు మహారాష్ట్ర సర్కార్ ఊరట కల్పించింది. ఆ సమయంలో టోల్ చెల్లించిన సుమారు 1.2 లక్షల వాహనాలకు రూ.5.16 కోట్లను తిరిగి చెల్లించనున్నట్లు మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ (MSRDC) ప్రకటించింది. రానున్న వారంలోగా ఈ మొత్తాన్ని నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.

February 23, 2026 / 09:52 AM IST

బుచ్చిలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

NLR: బుచ్చి మండలంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయాన్నే ఎనిమిది గంటలకు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. అధికారులు హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థులను లోపలికి అనుమతించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 09:51 AM IST

ఈనెల 28న శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వరాలయ వార్షికోత్సవం

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయ 22వ వార్షికోత్సవం ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాసుల హరిరంజన్ శర్మ, రఘు శర్మలు తెలిపారు. వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, చక్రి భజన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

February 23, 2026 / 09:49 AM IST

BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 పెరిగి రూ.1,61,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,900 పెరిగి రూ.1,47,900 పలుకుతోంది. ఇక, కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

February 23, 2026 / 09:49 AM IST

కృష్ణా, గోదావరి జలాలపై రాజీ లేదు: మంత్రి ఉత్తమ్

కృష్ణా: కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ వాటాను ఒక్క చుక్క కూడా వదులుకోబోమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆదివారం ముఖ్యమంత్రితో కలిసి దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన ఆయన, వచ్చే రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గోదావరి పరీవాహక ప్రాంతంలో వరి సాగు రికార్డు స్థాయిలో పెరిగిందని తెలిపారు.

February 23, 2026 / 09:48 AM IST

కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

విశాఖపట్నంలో 10 రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 41 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించారని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన బస్సులపై రూ.3,52,870 చలానా విధించినట్లు వెల్లడించారు.

February 23, 2026 / 09:46 AM IST

కేసీఆర్ ఏపీలో అడుగుపెడితే తరిమేస్తాం: వాసంశెట్టి

AP: తెలంగాణ మాజీ సీఎం KCRపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్ అయ్యారు. KCR, KTR ఏపీలో అడుగుపెడితే తరిమేస్తామని హెచ్చరించారు. BRS పేరుతో రావాలని చూస్తే అడుగుపెట్టనివ్వమని తెలిపారు. కేసీఆర్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలను ఓసీల్లో చేర్చి KCR పెద్ద తప్పు చేశారని విమర్శించారు. అందుకే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఓడించారని చెప్పారు.

February 23, 2026 / 09:46 AM IST

కరాటేలో అన్నదేవారపేట విద్యార్థుల ప్రతిభ

E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన అబ్దుల్ కలాం స్కూల్ విద్యార్థులు కరాటేలో అద్భుత ప్రతిభ చాటారు. నిడదవోలులో జరిగిన మూడవ సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో వీరు స్వర్ణ, రజత పతకాలు సాధించారు. ఈ పురస్కారాలను మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల ప్రతిభపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 09:45 AM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థినికి రజిత పథకం

PDPL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సిఎం కప్ 2025- 26 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఓదెల మండలం దాసరి పద్మా హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనగర్తి విద్యార్థిని అక్షిత ప్రతిభ చాటింది. బాక్సింగ్ అండర్-60 వెయిట్ కేటగిరీలో పోటీపడి రజత పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఓదెల ఎంఈఓ, ఉపాధ్యాయులు అభినందించారు.

February 23, 2026 / 09:45 AM IST

బిడ్డా.. నీకు న్యాయం జరిగేనా?

NGKL: పుట్టగానే కులోన్మాదానికి బలైతానని పాపం ఆ బిడ్డకు ఏం తెలుసు?, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఆ బిడ్డ నేడు కానరాని లోకాలకు వెళ్లింది. 9 నెలలు మోసిన ఆ తల్లి కన్నపేగు ఎంత తల్లడిల్లుతుందో. ఫులే, అంబేడ్కర్ లాంటి మహనీయులు ఎంత మంది పోరాడినా ఇప్పటికీ కుల వివక్ష ప్రాణాలు తీస్తోందన్న దానికి కుమ్మెర ఘటనే ఉదాహరణ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 09:44 AM IST

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 83,340.08 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభంతో 25728.85 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.73గా ఉంది.

February 23, 2026 / 09:43 AM IST

CM దేవాదుల సమీక్షలో ఘాటు వ్యాఖ్యలు

MLG: కన్నాయిగూడెంలో దేవాదుల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాల వివాదానికి రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు మంజూరు చేసి రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుతామని తెలిపారు.

February 23, 2026 / 09:40 AM IST

దివంగత నేత ఎర్రన్నాయుడికి లోకేష్ నివాళులు

AP: బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషిచేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని మంత్రి లోకేష్ తెలిపారు. రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా ఎర్రన్నాయుడు పేరుగడించారని చెప్పారు. కేంద్రమంత్రిగా, టీడీపీ సీనియర్ నేతగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా లోకేష్ నివాళులర్పించారు.

February 23, 2026 / 09:36 AM IST

కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి

JN: చిల్పూర్ మండలంలోని లూనావత్ తండాకు చెందిన గుగులోతు సురేష్ (24) కొబ్బరి చెట్టు నుంచి కింద పడి మృతిచెందాడు. కొబ్బరిచెట్టు ఎక్కి బొండాలు తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సురేష్ మృతితో తండాలో విషాదం నెలకొంది.

February 23, 2026 / 09:36 AM IST

బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తులు

KMM: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల ఎంపిక కోసం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దరఖాస్తులు కోరారు. గత ఐదేళ్లలో 10వ తరగతిలో 90% పైగా ఉత్తీర్ణత, అందులో 50% మంది మొదటి శ్రేణిలో నిలిచిన రాష్ట్ర/కేంద్ర గుర్తింపు పొందిన పాఠశాలలు దీనికి అర్హులన్నారు.

February 23, 2026 / 09:35 AM IST