»Alert For People Of Telangana Hail Rain For 3 Days
Rain Alert : తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 3 రోజుల పాటు వడగండ్ల వర్షం!
తెలంగాణ(Telangana)లోని వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad weather Department) ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, పలుచోట్ల వడగండ్లు సైతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ(Telangana) ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow alert) జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షం(Rain) కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర కోస్తా కర్ణాటక వరకూ ద్రోణి కొనసాగుతోందని, దాని ప్రభావంతో 40 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది.
తెలంగాణ(Telangana)లోని వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad weather Department) ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, పలుచోట్ల వడగండ్లు సైతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, పొడి వాతావరణం(Weather) ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, అయితే పలు ప్రాంతాల్లో మాత్రం అంతటి ఉష్ణోగ్రతలు ఉండవని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది.