టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ల లీక్ తీవ్ర సంచలనం సృష్టించినది తెలిసిందే. దీనిపై సిట్దర్యాప్తులో భాగంగా బోర్డు ఉద్యోగులతోపాటు మొత్తం 17 మందిని అరెస్టు చేసింది. చివరగా అరెస్టు అయిన సుస్మిత, లౌకిక్దంపతులను కోర్టు అనుమతితో శుక్రవారం కస్టడీకి తీసుకుని విచారించారు.
వాట్సప్ నిత్యం ప్రజలకు అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మరో మూడు ఫీచర్లను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
పూణె(Pune)లోని పింపుల్ గురవ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు (BUS) లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు.
సంస్థకు అవసరమైన మూలధన సమీకరణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం, అత్యుత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు అదే చేస్తోంది.
యూజీసీ గుర్తింపు ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సేవలు ఉత్తర భారతదేశంలోనూ విస్తరించాలని నిర్ణయించినట్లు టీటీడీ (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీ వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం(graduation ceremony) నిర్వహించాలని నిర్ణయించామన్నారు
అమర్‌నాథ్ ఆలయ యాత్ర(Amarnath Yatra) జులై 1వ తేదీ నుంచి ప్రారంభమై 62 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్ర ఆగస్టు 31, 2023న ముగుస్తుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మోడ్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.
సురేంద్ర బీజేపీ కిసాన్ మోర్చా నజఫ్‌గఢ్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సురేంద్ర మతియాల తన కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆఫీసులో కూర్చున్నాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆకస్మాత్తుగా కార్యాలయంలోకి చొరబడి కాల్పులు జరిపారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuramakrishna Raju) స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఫీల్డింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా క్యాచ్ లు భారీగా చేజార్చుకున్నారు. క్యాచ్ లను విజయవంతంగా పట్టి ఉంటే కోల్ కత్తా భారీ తేడాతో ఓడిపోయేది.
మేషరాశికి జన్మరాశియందు శుక్ర, రాహువులు మరియు వ్యయస్థానమునందు రవి, బుధ, గురులు సంచారంచేత పనులు యందు ఆలస్యము మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమగును. ధన నష్టము సూచనలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.
నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. మా తాత విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు నుంచి నా తండ్రి చంద్రబాబు వరకు ఈ లోకేశ్ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసిరారు
ఓ హోటల్ లో పని చేసే వ్యక్తి కస్టమర్లు తినే ఆహారంలో ఉమ్మి వేశాడు. ఉమ్మి వేస్తూ ఆ వ్యక్తి రోటీలు తయారు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాగ్ పత్ జిల్లా రతౌల్ పట్టణంలో చోటుచేసుకుంది.
కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) బౌలర్లను వారి సొంతగడ్డపైనే చితక్కొట్టిన ఈ 24 ఏళ్ల కుర్రాడు హ్యారీ బ్రూక్ (Harry Brooke) కేవలం 55 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో అన్ని రకాల క్రికెటింగ్ షాట్లు ఆడిన బ్రూక్ మొత్తం 12 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ (Umesh Yadav)బౌలింగ్ లో ఆఫ్ సైడ్ కొట్టిన సిక్సులు ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచాయి.
ఏపీ(Ap)లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు అలర్ట్(Alert) జారీ చేసింది.