జనవరి నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్ అప్డేషన్, నేషనల్ పెన్షన్ స్కీం రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్...
తెలంగాణ ఇంచార్జీ డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్‌కు చెందిన వారు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ అంశంపై తాను ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)...
రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్దులకు అప్పాయింట్‌మెంట్ లెటర్లను ప్రధాని మోదీ వీడియో కాన్షరెన్స్ ద్వారా పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్లు ,లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు,కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్‌మెంట్ ఈ పథకం ద్వారా చేస్తారు. అందుకు సంబంధించినకు నియామక పత్రాలను పంపిణీ చేసి ప్రధాని రోజ్ గార్...
పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. పట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం మూడు క్యాటగిరీల్లో ఈ పోటీని నిర్వహించారు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్ విభాగాల్లో సుమారు 500 మంది ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ, జనసేన ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యుహాలు రచిస్తున్నారు. 2014 ఎన్నికల మాదిరిగా 2024లో అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుపుతున్నారు. పవన్ కూడా చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తిరిగి అధికారం చేపట్టాలంటే కాపు...
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ రోజు (శుక్రవారం) చేపట్టింది. 12 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్‌పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అధికారుల కేటాయింపునకు సంబంధించి ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని చీఫ్ జస్టిస్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్లప...
అంబానీ వారింట్లో జరిగిన నిశితార్థపు వేడుక అతిరథ మహారథులు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పలు రంగాల ప్రముఖులు అతిథిలుగా హాజరు కాగా ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ ల నిశితార్థం వేడుకగా ముగిసింది. ఆ ఫొటో గ్యాలరీ ఇదిగో.. అతిథులకు ఆహ్వానం పలుకుతున్న పూలద్వారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అ...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు వరించనుంది. సినీ నటుడిగా సమాజానికి, రాజకీయ వేత్తగా ప్రజలకు సేవ చేసినందుకు అవార్డు ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందట. ఈ అంశం గురించి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని చాలా రోజుల నుంచి టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరు...
నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో ...
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. వారిపై విమర్శల వర్షం కురిపించారు. కమీషన్ల కోసమే కాఫర్ డ్యాం లేకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆరోపించారు. ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించడం, వాటాలు కొట్టేయడం, దోపిడీలు చేయడం, దొడ్డిదారిన పదవులు చేపట్టడం మీకు, మీ కుమారుడికి అలవాటే అన్నారాయన. నేను మీకన్నా వంద రెట్లు నిజాయితీపరుడ్ని గుర్తుపెట్టుకో...
ఖమ్మంలో నిర్వహించిన తమ బీఆర్ఎస్ పార్టీ సభ విజయవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు లక్షలాదిగా హాజరయ్యారని ఆయన చెప్పారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రితో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోనుందన్నారు. మైదానంలో చిన్నపాటి సముద్రం కనిపించిందన్నారు. మైదానం సరిపోక బయటే లక్షమంది దాక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండిపోయారని తెలిపారు మంత...
జీవో నెంబర్ 1 పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్పులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రోడ్ల పైన సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిప...
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆయనపై చర్చలు తీసుకోవాలని రెజ్లర్లు వరుసగా మూడో రోజు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఇది రాజకీయ కుట్రలో భాగమని, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి అన్నీ బయటపెడతానని బ్రిజ్ భూషణ్ తెలిపారు. రెజ్లర్ల నిరసన తీవ్రం కావడంతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రంగ...
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మంగళ్‌హాట్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని సయ్యద్ మహమూద్ అలీ గతేడాది ఆగస్టులో కంచన్ బాగ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కంచన్ బాగ్ నుంచి మంగళ్‌హాట్ స్టేషన్ మార్చారు. తాజాగా ఇచ్చిన నోటీసులపై రాజా సింగ్ స్పందించారు. పోలీసులు తనను అరెస...
ఏపీఎస్ ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ నెల 18న ఒక్కరోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. ఇందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో రికార్డుస్థాయి ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే గతంలో మాదిరి టిక్కెట్ ధరలను 50 శ...