పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. పట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం మూడు క్యాటగిరీల్లో ఈ పోటీని నిర్వహించారు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్ విభాగాల్లో సుమారు 500 మంది పోటీ పడ్డారు. సీనియర్ సిటిజన్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ శంకర్ కాంత్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 647 గ్రాముల పెరుగు తిని మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.
Looks like the competition was 'curdled' with tension, but the dairy warrior emerged victorious by gobbling up 3 kgs & 647 gms of curd in just 3 minutes! Sudha Dairy successfully organized a Curd-Eating Competition today at Patna Dairy Project to promote health benefits of curd. pic.twitter.com/4aE2HeAMRD
— National Cooperative Dairy Federation of India Ltd (@ncdficoop) January 18, 2023