• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు

JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో శనివారం వ్యవసాయ అధికారి రాజకుమార్ ఆధ్వర్యంలో రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పంటలకు సరైన ఎరువులు, పంట మార్పిడి ప్రాముఖ్యతను ఆయన రైతులకు వివరించారు. అలాగే వారు వేసిన పంటలకు ఏ సమయంలో ఎంత మోతాదులో రసాయనాలు వాడాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో, సర్పంచ్, ఉపసర్పంచ్, రైతులు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:43 PM IST

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: జూపల్లి

TG: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, వ్యవసాయం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం వంటి మౌలిక వసతులపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

February 21, 2026 / 07:42 PM IST

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

MDCL: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరిన ఈటల రాజేందర్‌ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఖరిని, పాలీసుల తీరును తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

February 21, 2026 / 07:42 PM IST

రేపు టీడీపీ కార్యాలయానికి భూమిపూజ

CTR: నగరి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం ఆదివారం ఉదయం 10.26 గంటలకు చిత్తూరు బస్టాండ్ సమీపంలో నిర్వహించనున్నట్లు నగరి ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది. కార్యక్రమానికి MLA భానుప్రకాష్ హాజరుకానున్నారు. నగరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

February 21, 2026 / 07:41 PM IST

రూ. 15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

RR: కొందుర్గు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. రాబోవు మూడు సంవత్సరాల్లో మండలం రూపురేఖలు మారబోతున్నాయని, మండల కేంద్రంలో రూ. 15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొందుర్గు మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు.

February 21, 2026 / 07:41 PM IST

‘అభ్యుదయ సాహిత్యాన్ని కాపాడుకోవాలి’

NLG: ఫిబ్రవరి 21న ‘రెడ్ బుక్ డే’ సందర్భంగా నల్గొండ సుందరయ్య భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో అధ్యయన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 1848లో ఇదే రోజున వెలువడిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ స్మరణార్థం ఈ దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సామాజిక మార్పు, సమానత్వం కోసం రాసిన అభ్యుదయ సాహిత్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.

February 21, 2026 / 07:41 PM IST

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

CTR: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం తన కార్యాలయంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. పరిష్కారం అవసరమైన అంశాలపై వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

February 21, 2026 / 07:39 PM IST

‘పరిశుభ్రత సామాజిక ఉద్యమంగా మారాలి’

TPT: సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వెంకటనాగరాజు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతను సామాజిక ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ర్యాలీ, పోస్టర్ పోటీలు నిర్వహించగా ఎన్ఎస్ఎస్ సభ్యులు పాల్గోన్నారు.

February 21, 2026 / 07:37 PM IST

గోల్డ్ మెడల్స్ కోసం విరాళం అందజేత

MBNR: పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జంగం విశ్వనాథ్ తన ఉదారతను చాటుకున్నారు. సైకాలజీ విభాగంలో మెరిట్ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించేందుకు రూ.3 లక్షల చెక్కును వీసీ ప్రొ. కె. శ్రీనివాస్‌కు అందజేశారు. గత ఏడాది కూడా ఆయన అభ్యర్థుల కోసం రూ.3.5 లక్షల విలువైన పుస్తకాలను విరాళంగా ఇచ్చి అండగా నిలిచారు.

February 21, 2026 / 07:35 PM IST

సిద్దేశ్వర ఆలయం హుండీ లెక్కింపు

SRD: కంగ్టి గ్రామ శివారులోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆలయ ఈవో శివ రుద్రప్ప పర్యవేక్షణలో అర్చకులు స్థానికులు కలిసి హుండీని లెక్కించారు. గత ఐదు నెలల నుంచి హుండీ ద్వారా రూ. 72,525 ఆదాయం వచ్చినట్లు EO శివ రుద్రప్ప తెలిపారు. వచ్చిన ఆదాయంతో ఆలయ అభివృద్ధికి నిధులు ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. ఇందులో సర్పంచ్ కృష్ణ ముదిరాజ్, సంగమేశ్వర్ ఉన్నారు.

February 21, 2026 / 07:35 PM IST

ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కమిటీ రద్దు

SRPT: కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ వెంకటేశ్వర్లు మాదిగ జిల్లా కమిటీని రద్దు చేసినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో ఉద్యమానికి జిల్లా కమిటీ నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు.

February 21, 2026 / 07:33 PM IST

జాతీయస్థాయికి తూప్రాన్ విద్యార్థి ప్రాజెక్టు

MDK: తూప్రాన్‌లోని గీతా స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహతి తయారు చేసిన ‘వ్యర్ధాల నిర్వహణ- ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. కామారెడ్డిలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో దక్షిణ భారత స్థాయితోపాటు, జాతీయస్థాయికి ఎంపికైంది. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రాజెక్టులు ఎంపిక కాగా, జిల్లాకు చెందిన నాలుగు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.

February 21, 2026 / 07:32 PM IST

రిమ్స్ SNCU విభాగానికి జాతీయ స్థాయి గుర్తింపు: కలెక్టర్

ADB: పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మక జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్‌లో రిమ్స్ ఆసుపత్రిలోని SNCU విభాగానికి జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు రూ. 5 వేల రివార్డు సాధించడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలిపారు. శిశు ఆరోగ్య విభాగంలో ఇన్ఫెక్షన్ల రేటును గణనీయంగా తగ్గించడంలో మంచి ఫలితాలను సాధించాలని కొనియాడారు. ఈ మేరకు సిబ్బందిని ఆయన అభినందించారు.

February 21, 2026 / 07:32 PM IST

కార్పొరేట్ బడ్జెట్‌కు వ్యతిరేకంగా 23న ధర్నా

KRNL: రాష్ట్ర బడ్జెట్ రైతులకు ఉపయోగపడకుండా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) మరియు కౌలు రైతు సంఘం విమర్శించాయి. ఈనెల 23వ తేదీ సోమవారం ఆదోనిలో ఎమ్మార్వో (2) కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. 2026–27 బడ్జెట్‌లో వ్యవసాయానికి తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 07:31 PM IST

ముగిసిన వార్డ్ సభ్యుల శిక్షణ

NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఎంపీవో గోవర్ధన్ మాట్లాడుతూ.. గత ఐదు రోజుల నుంచి నేర్చుకున్న అంశాలను వార్డు సభ్యులు ఆయా వార్డులలో ఆచరణలో పెట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని అన్నారు. అనంతరం శిక్షణ సర్టిఫికెట్లను వార్డు సభ్యులకు అందజేశారు.

February 21, 2026 / 07:31 PM IST