• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Kodada : అత్తారింటి ముందు అల్లుడి నిరసన

అత్తారింటి (Attarinti) వేధింపులతో కోడళ్ళు కానీ, ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేయడం ఇప్పటివరకు చూశాం. ఇక్కడ మాత్రం అల్లుడు అత్తారింటిముందు ధర్నా చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తన కన్న పేగును తనకు దూరం చేయ్యొద్దంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు (Kodada)చెందిన రమణి పృథ్వితో హైదరాబాద్ (Hyderabad) చెందిన ప్రవీణ్ కుమార్‌కు 2018 ఆగస్టులో వివాహమైంది.

April 3, 2023 / 11:54 AM IST

Anam Ramanarayana Reddy : టీడీపీలో చేరతారా..? ఆనం సమాధానం ఇదే..!

Anam Ramanarayana Reddy : ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై ఆయన తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను పార్టీ సస్పెండ్ చేయడంపై కూడా ఆయన స్పందించారు.

April 3, 2023 / 11:42 AM IST

Chief justice : తెలంగాణ హైకోర్టు తొలి సీజే..రాధాకృష్ణన్ కన్నుమూత

తెలంగాణ (Telanagna) హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జి తొట్టతిల్ బి. రాధాకృష్ణన్ (Radhakrishnan) కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొచ్చిలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేరళ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కోల్‌కత్తా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా (chief justice) పనిచేశారు. దీంతోపాటు రాధాకృష్ణన్ కేరళ లీగల్ సర్వీసెస...

April 3, 2023 / 11:30 AM IST

CM Jagan : ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం

గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా సీఎం జగన్‌ (CM Jagan) కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ (YSRCP) ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరుకానున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్‌, పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు.

April 3, 2023 / 10:49 AM IST

Gandhi Bhavan : జంగా రాఘవరెడ్డికి టీపీసీసీ షాక్‌..షోకాజు నోటీస్..

జనగామ డీసీసీ (Janagaam DCC) అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి (Janga Raghav Reddy) టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాల‌ని జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సంఘం చైర్మన్ జీ చిన్నారెడ్డి ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో(Gandhi Bhavan) జరిగిన టీపీసీసీ (TPCC) విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డి గైర్హా...

April 3, 2023 / 09:56 AM IST

Kannur Express : ట్రైన్‌లో ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి

కేరళలో దారుణం జరిగింది. ఇద్దరు రైలు (Train) ప్రయాణికుల మధ్య గొడవ తలెత్తంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్ (passenger)పై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో అళపుజ కన్నూర్ ఎక్స్‌ప్రెస్ ( Alappuzha Kannur Express) రైల్లో ఈలాతూర్ (eelathur)వద్ద ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడిని కాపాడేందుకు ఇతర ప్రయాణికులు రంగంలోకి దిగి ట్రైన్‌లో చైన్ లాగారు.

April 3, 2023 / 09:27 AM IST

Odisha బాలుడి వెనుక భాగంలో దిగిన గడ్డపార.. అతికష్టమ్మీద తొలగింపు

గతంలో ఇదే ఆస్పత్రి వైద్యులు ఒక వ్యక్తి శరీరంలో ఉన్న స్టీల్ గ్లాస్ తొలగించారు. అత్యంత అరుదైన శస్త్ర చికిత్సలు ఈ ఆస్పత్రి వైద్యులు చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. 

April 3, 2023 / 09:01 AM IST

నేటి నుంచి టెన్త్ పరీక్షలు…రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు

తెలంగాణలో (Telanagana) నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్(Tenth Exams) జరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు. విద్యార్థులు (Students) పరీక్షా కేంద్రాలకు గంట ముందే రావాలని అధికారులు సూచించారు.

April 3, 2023 / 08:52 AM IST

IPL 2023: RR బౌలర్ల ప్రదర్శన అదుర్స్.. SRH దారుణ ఓటమి

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు(Rajasthan Royals)..సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad)పై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 8 వికెట్ల నష్టానికి 131 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది.

April 2, 2023 / 07:25 PM IST

Perni Nani: చంద్రబాబు, పవన్ కు పులివెందులలో పోటీ చేసే ధైర్యముందా?

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) సవాల్ విసిరారు. అంతేకాదు ధైర్యముంటే పులివెందుల(Pulivendula)లో సీఎం జగన్(cm jagan)కు పోటీగా పవన్(pawan kalyan) లేదా చంద్రబాబు(chandrababu naidu) పోటీ చేయాలని సవాల్ చేశారు.

April 2, 2023 / 06:43 PM IST

Rashmika Dating: బెల్లంకొండ శ్రీనివాస్‌తో రష్మిక డేటింగ్?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna)-విజయ్(vijay)తో విడిపోయి.. బెల్లంకొండ శ్రీనివాస్‌(Bellamkonda Srinivas)తో డేటింగ్(dating) చేస్తున్నట్లు నెట్టింట పుకార్లు వస్తున్నాయి. ముంబయి విమానాశ్రయంలో ఇటీవల వీరిద్దరు జంటగా కనిపించారని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు రష్మిక, శ్రీనివాస్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారని.. ఇటీవల తరచుగా కలుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ నిజమో కాదో తెలియ...

April 2, 2023 / 06:10 PM IST

Maoists: ఎమ్మెల్యేకు మావోయిస్టుల బెదిరింపు లేఖ..అమ్మాయిల విషయంలో కూడా

తెలంగాణలోని బెల్లంపల్లి(Bellampalli) ఎమ్మెల్యే(MLA) దుర్గం చిన్నయ్య(Durgam Chinnaiah)కు మావోయిస్టులు(Maoists) లేఖ రాశారు. చిన్నయ్య డైరీ పని కోసం వచ్చే మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని లేఖలోపేర్కొన్నారు. దీంతోపాటు బెదిరింపులు, భూ కబ్జాలు చేస్తున్నారని..ఈ క్రమంలో తీరు మార్చుకోవాలని సూచించారు.

April 2, 2023 / 05:35 PM IST

Minor: విద్యార్థినిని బలవంతంగా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు

విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ మైనర్ విద్యార్థిని విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగలేదు. ఆ యువతికి మాయ మాటలు చెప్పి ఏకంగా తిరుపతి తీసుకేళ్లి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతని ప్రవర్తనను గుర్తించిన బాలిక తన పేరెంట్స్ కు విషయం చెప్పడంతో పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని అరెస్టు చేశారు.

April 2, 2023 / 05:08 PM IST

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ కలుస్తాయ్!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే BRS, కాంగ్రెస్ పార్టీలు కలిసే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్(bandi sanjay) అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు రెండు సార్లు అధికారం ఇస్తే కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేశాడని సంజయ్ ఆరోపించారు.

April 2, 2023 / 04:18 PM IST

Nara Lokesh: ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మండిపడ్డ నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Ketireddy Venkatarami Reddy)పై హాట్ కామెంట్స్ చేశారు. కేతిరెడ్డి ఎర్రగుట్ట భూములను ఆక్రమించారని ఆరోపించారు. 902, 909 సర్వే నంబర్లలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ఫామ్‌హౌస్‌ కట్టించుకుని ప్రజలకు నీతులు చెబుతున్నారని కేతిరెడ్డిపై లోకేష్ మండిపడ్డారు.

April 2, 2023 / 03:45 PM IST