CM KCR:మరో ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. షెడ్యూల్ ఇచ్చిన నెల తీసి వేస్తే 5 నెలల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో నియోజకవర్గాల్లోనే ఉండాలని నేతలకు స్పష్టంచేశారు. బీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఈ రోజు విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత మీడియాతో కేసీఆర్ మాట్లాడారు.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 105 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధిస్తోందని కేసీఆర్ (CM KCR) తెలిపారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులు చెబితే చాలని ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ అన్నారు. దాంతోనే సునాయసంగా విజయం సాధిస్తారని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ గురించి చర్చించారు.