Tamilsai Soundara Rajan : భద్రాద్రి రాములోరిని దర్శించుకున్న గవర్నర్ తమిళసై
ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై(Governor Tamilsai) ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాల ఆదివాసీల ప్రజలు వారి సమస్యలను గవర్నర్కు విన్నవించారు. అంధ్రలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆదివాసీలు కోరారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ (Tamilsai Soundara Rajan) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు విచ్చేశారు. పర్యటనలో భాగంగా మొదటిగా గవర్నర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam) రాములోరి ఆలయన్ని దర్మించుకున్నారు.సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు గవర్నర్ కు పూర్ణ కుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ అంత్రాలయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయం ఆవరణలో గల శ్రీలక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలికి, స్వామి వారి జ్ఞాపిక, లడ్డు ప్రసాదం అందచేశారు.
గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కి భద్రాచల నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే పొదెం వీరయ్య (MLA Podem Veeraiah) వినతి పత్రాలు అందించారు. 1. ముందుగా భద్రాచల నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ ఆంధ్రాలో విలీనమైనటువంటి ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో మరల విలీనం చేయవలసిందిగా కోరుతూ వినతి పత్రం అందించడం జరిగింది. పాండురంగాపురం (Pandurangapuram) నుండి సారపాక గ్రామం వరకు రైల్వే లైన్ ఎక్స్ టెన్షన్ చేసి భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన్నికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పొదెం కోరారు.