• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నాటు సార స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

ATP: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో నాటు స్థావరం స్థావరంపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఎస్సై అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమకు రాబడిన సమాచారంతో గ్రామంలో నాటు సారా తయారీ కేంద్రంపై దాడులు చేశామన్నారు. సుమారు 30 లీటర్ల నాటు సార ఊటను ధ్వంసం చేశామన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 12:48 PM IST

విగ్రహ ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న మంత్రి

NLG: బోడుప్పల్‌‌లోని కేశవనగర్‌లో ఏర్పాటు చేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.

February 20, 2026 / 12:47 PM IST

గోటూరులో బహుజన ఆత్మగౌరవ ధూంధాం

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ బహుజనుల ఆత్మ గౌరవ ధూంధాం కళాకారులచే ఒక సమావేశం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.నాయకులు యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు గౌతం కోరారు.

February 20, 2026 / 12:47 PM IST

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం మాణిక్యరం గ్రామంలో శుక్రవారం సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనసారా కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

February 20, 2026 / 12:46 PM IST

మంత్రి చొరవతో చిన్నారికి వైద్యం

KRNL: పేదల సమస్యల పరిష్కారంలో మంత్రి టీజీ భరత్ మరోసారి చొరవ చూపారు. కర్నూలు కొత్తపేటకు చెందిన నరసింహ–శ్వేత దంపతుల కుమారుడు కార్తికేయ (9) పుట్టుకతో దివ్యాంగుడు. శస్త్రచికిత్సకు రూ.8.20 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో వారు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. విషయం మంత్రి దృష్టికి వెళ్లడంతో నిధులు మంజూరై, నంద్యాలలో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది.

February 20, 2026 / 12:45 PM IST

‘దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలి’

VZM: దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. అంతర్జాతీయ సామజిక న్యాయం దినోత్సవం సందర్భంగా శుక్రవారం బొబ్బిలిలో దేశ సంపదలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ నిరసన తెలిపారు. మధ్య తరగతి ఉద్యోగులు, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు కొంతమంది చేతుల్లోకి వెళ్తుందని విమర్శించారు.

February 20, 2026 / 12:45 PM IST

ఈ నెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో

మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎస్ పరీక్షల డీఈవో సూచించారు.

February 20, 2026 / 12:44 PM IST

గృహ నిర్మాణ పూజలో పాల్గొన్న బాలకృష్ణ దంపతులు

SS: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురంలో జరిగిన నూతన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో దంపతులు ఇరువురు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తమ నియోజకవర్గ ప్రజల శుభకార్యాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బాలకృష్ణ పేర్కొన్నారు.

February 20, 2026 / 12:43 PM IST

సిరిపురం యాదయ్య సేవలు మరువలేనివి. కాంగ్రెస్ నాయకులు

RR: తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.

February 20, 2026 / 12:43 PM IST

హైదరాబాద్ సీపీ సజ్జన్నార్‌ను కలిసిన జిల్లా ఎస్పీ

అన్నమయ్య: రాయచోటిలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లాకు విచ్చేసిన హైదరాబాద్ సీపీసజ్జన్నార్‌ను అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక గెస్ట్ హౌస్‌లో జరిగిన భేటీలో సీపీకి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై కాసేపు చర్చించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున గౌరవపూర్వక అభినందనలు తెలిపారు.

February 20, 2026 / 12:43 PM IST

బురుగుపల్లిలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం

KNR: గంగాధర మండలంలోని బురుగుపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దులం కళ్యాణ్ ఆధ్వర్యంలో కిరాణా, చికెన్, మటన్ షాప్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బయోడీగ్రేడబుల్ కవర్లు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా MPDO ప్లాస్టిక్ వల్ల పర్యావరణం నష్టాలను వివరించారు.

February 20, 2026 / 12:43 PM IST

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈవో ప్రసాద్

SKLM: ధర్మవరం మండలం వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి  ప్రసాద్ రావు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆహారం అందుతుందా లేదా అనే విషయంపై విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చిన తెలియజేయాలని కోరారు.

February 20, 2026 / 12:42 PM IST

నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు

HYD: నగరంలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అదే తరహా సందేశం రావడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

February 20, 2026 / 12:42 PM IST

ప్రైవేట్ టీచర్లకు ఇండ్లు కేటాయించండి..!

SRPT: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద నిర్మించిన సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను, అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మున్సిపల్ వైస్ చైర్మన్‌ను కోరారు. అనంతరం ఆయనను ప్రైవేట్ ఉపాధ్యాయులు సన్మానించారు.

February 20, 2026 / 12:42 PM IST

HYDలో పేరుకే ఉచిత పార్కింగ్!

HYD: జీవో నం. 15 ప్రకారం మాల్స్ లేదా మల్టీప్లెక్స్‌లో మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితం. ఒకవేళ అక్కడ షాపింగ్ చేస్తే గంట వరకు ఉచితంగా ఉండాలి. కానీ, మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని కొన్ని ప్రధాన మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తున్నాయి. లోపల సమయం వృథా అయ్యేలా చేసి రూ. 50 నుంచి రూ. 100 వసూలు చేయడం గమనార్హం.

February 20, 2026 / 12:40 PM IST