Bansuri Swaraj : బీజేపీ సీనియర్ నేత, దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె .. బన్సూరీ స్వరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో- కన్వీనర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోన్న బాన్సురీకి రాజకీయాల్లో ఇది తొలి అడుగుగా విశ్లేషకులు పేర్కొన్నారు.
రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆసుపత్రికి తాళం వేసి, రోడ్డు పైన పానీ పూరి బండి పెట్టుకున్న ఆశ్చరకర సంఘటన జరిగింది. ఈ బండి పైన ప్రయివేటు డాక్టర్ అని కూడా రాసి ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే సదరు మహిళా డాక్టర్ పానీ పూరీ బండి పెట్టుకున్న పక్కనే మిగతా సిబ్బంది టీ దుకాణం పెట్టి విక్రయిస్తున్నారు.
నిజాం పాలన నుంచి హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విస్మరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని గోరటలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా ఆదివారం వ్యాఖ్యానించారు.
దాదాపు గత మూడేళ్లుగా అరుదుగా బయట కనిపిస్తున్న అలీబాబా ఫౌండర్ జాక్ మా (Alibaba founder Jack Ma) తాజాగా చైనాలో (China) ప్రత్యక్షమయ్యాడు. చైనా హాంగ్‌జౌ లోని ఓ పాఠశాలలో (School in Hangzhou) అతను కనిపించినట్లుగా వార్తలు వచ్చాయి. 2020లో చైనా ఆర్థిక నియంత్రణ సంస్థల పైన ఆయన తీవ్ర విమర్శలు చేశాడు.
బాలీవుడ్‌లో స్టార్ హీరో షాహిద్ కపూర్ (shahid kapoor) పుష్ప-2లో గెస్ట్ రోల్ పోషిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. అల్లు అర్జున్ (allu arjun) పాత్రను పరిచయం చేస్తూ ఈ పాత్ర ఉంటుందట. థ్రిల్లింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తోందని.. ఈ పాత్రను ఊహించని విధంగా సుకుమార్ (sukumar) తెరకెక్కిస్తారట. మూవీలో 10 నిమిషాల పాటు (10 minutes) ఉంటుందని.. అక్కడి మార్కెట్ పెంచుతుందని తెలుస్తోంది.
పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సర్జరీ చేసుకోవాలని విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు చేసిన వారిచేతనే గ్లోబల్ స్టార్ (Globar Star) హీరో అంటూ గుర్తింపు పొంది రామ్ చరణ్ ప్రత్యేకత చాటుతున్నాడు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత రిట్ పిటిషన్ పైన ఈ రోజు (సోమవారం, 27) న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.
కవిత ఈ రోజు వరుసగా చేసిన పలు ట్వీట్లు (Kavitha Twitter) నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓ చిన్నారి వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యూష్ గార్నెపూడి అనే నెటిజన్ తమ కూతురు వీడియోను పోస్ట్ చేయగా.. దీనిని రీట్వీట్ చేశారు కవిత.
Manchu manoj:మంచు మనోజ్ (Manchu manoj) మీడియా (media) ముందుకు వచ్చారు. ఈ సారి అన్న విష్ణుతో (vishnu) గొడవ గురించి మాత్రం స్పందించలేదు. ఆ అంశంపై ప్రశ్నించిన సమాధానం దాటవేశారు. రియల్ స్టార్ శ్రీహరి (sri hari) కుమారుడు మేఘాన్ష్ (meghansh) కొత్త సినిమా ప్రారంభోత్సవానికి మంచు మనోజ్ (manoj) వచ్చారు. తన తమ్ముడి సినిమా హిట్ కావాలని కోరుకున్నారు.
18 ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌలి (SS Rajamouli), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులకు అలరిస్తుందో లేదో చూడాలి. బాలీవుడ్ (Bollywood)లో విజయవంతమైతే సాయి శ్రీనివాస్ మరో సినిమా అక్కడే చేసే అవకాశం ఉంది.
ఏపీలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్(Rapaka vara prasad) మరోసారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారిపోయాయి. తాను గతంలో సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు పడేవన్నారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొ...
ధవన్ కు ఇదే చివరి ఐపీఎల్ కానుందని తెలుస్తున్నది. అతడు త్వరలో ఆటకు వీడ్కోలు (Retirement) పలికే అవకాశం ఉంది. 37 ఏళ్లు వయసు ఉండడం.. నిలకడ లేమి ఆటతీరుతో నిరాశ పరుస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సీజన్ లో సత్తా చాటితేనే అతడి భవిష్యత్ ఆధారపడి ఉంది.
ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) పైన అనర్హత వేటు పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఓ కేసులో జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన లక్ష్వద్వీప్ మాజీ పార్లమెంటు సభ్యుడు మహమ్మద్ ఫైజల్ (lakshadweep mp mohammed faizal) సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించాడు.
బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా కొన్ని చోట్ల రథోత్సవం ఘనంగా జరుపుతారు. ఇంకొన్ని చోట్ల పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కుక్కల పరుగు(Dogs Running) పోటీలు(competition) నిర్వహించడం గురించి ఎక్కడైనా విన్నారా? లేదా అయితే ఈ వార్తను చదవేయండి మీకే తెలుస్తుంది.
Viral News : ఈరోజుల్లో దాదాపు అందరూ ఆస్తి కోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధం కన్నా....కూడా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న రోజులవి. అలాంటిది... ఈ అన్నలు మాత్రం అలా కాదు. చెల్లి పెళ్లి ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు.