New life started అంటోన్న మంచు మనోజ్, విష్ణుతో ఇష్యూపై నో కామెంట్
Manchu manoj:మంచు మనోజ్ (Manchu manoj) మీడియా (media) ముందుకు వచ్చారు. ఈ సారి అన్న విష్ణుతో (vishnu) గొడవ గురించి మాత్రం స్పందించలేదు. ఆ అంశంపై ప్రశ్నించిన సమాధానం దాటవేశారు. రియల్ స్టార్ శ్రీహరి (sri hari) కుమారుడు మేఘాన్ష్ (meghansh) కొత్త సినిమా ప్రారంభోత్సవానికి మంచు మనోజ్ (manoj) వచ్చారు. తన తమ్ముడి సినిమా హిట్ కావాలని కోరుకున్నారు.

కొత్త జీవితాన్ని ప్రారంభించాను.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అన్నారు. తనకు సినిమానే లైఫ్.. ప్రేక్షకులే జీవితం అని చెప్పారు. సినిమా లేకుంటే తనకేమీ లేదన్నారు. మళ్లీ సినిమాకే వస్తున్నానని చెప్పుకొచ్చారు. ‘వాట్ ద ఫిష్’ మూవీతోపాటు మరో సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. మంచు విష్ణు (vishnu) గురించి అడగగా స్పందించలేదు. ఇటీవల అన్నదమ్ముల గొడవ సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
సారథి (sarathy) అని మోహన్ బాబుకు సోదరుడి వరస అవుతారు. ఈయన మొన్నటి వరకు విష్ణు (vishnu) వద్ద మేనేజర్‌గా పనిచేశాడు. మానేసి.. మనోజ్ (manoj) వద్ద ఉంటున్నాడు. మోహన్ బాబు (mohan babu) వద్ద కూడా పనిచేశాడు. ఇటీవల సారథి (sarathy) ఇంటికి వచ్చి విష్ణు దాడి చేశాడు. ఆ వీడియోను (video) మంచు మనోజ్ (manoj) షేర్ చేశాడు. విష్ణు (vishnu) ఇలాగే తనవాళ్లను, బంధువులను కొడుతుంటాడని సీరియస్ అయ్యాడు. మోహన్ బాబు మనోజ్‌కు ఫోస్ చేసి వాట్సాప్ స్టేటస్, వీడియో డిలేట్ చేయమని ఆదేశించడంతో తీసివేశాడు.
ఇటీవల జరిగిన మంచు మనోజ్ (manoj) పెళ్లికి విష్ణు (vishnu) కూడా గెస్ట్‌లా వచ్చి వెళ్లాడు. దీంతో వారి మధ్య గ్యాప్ వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తర్వాత ఇద్దరూ గొడవ పడటంతో వారి మధ్య విభేదాలు నిజమేనని అనిపిస్తోంది.