• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాలువలో శవమై తేలిన బీజేపీ నేత

TG: జగిత్యాల జిల్లా సుద్ధపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బీజేపీ నేత రమణ అనుమానాస్పద స్థితిలో కాలువలో శవమై తేలారు. గతంలో BRS పార్టీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయనపై మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, ప్రమాదమా లేక హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 01:41 PM IST

వేదనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం

TPT: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు, స్థానిక సంఘాల వారు భక్తుల కోసం అన్ని సౌకర్యాలను అందించారు. కుంభాభిషేకం ద్వారా ఆలయంలో పవిత్రత, ఆధ్యాత్మిక ఉత్సాహం మరింత పెరిగినట్లు భక్తులు తెలిపారు.

February 22, 2026 / 01:40 PM IST

మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు మొదలు

KDP: నర్సాపురంలోని ఏపీ మోడల్ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ సౌజన్య పేర్కొ న్నారు. ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు అన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 100 సీట్లు ఉంటాయని దరఖాస్తుచేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 12వ తేదీ ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందన్నారు.

February 22, 2026 / 01:40 PM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఆదివారం కొంతం కిష్టమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. పేద కుటుంబానికి చెందిన కిష్టమ్మ కుటుంబ సభ్యులకు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తమ వంతు సహాయంగా రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.

February 22, 2026 / 01:38 PM IST

గూడూరులో నీళ్ల గోస?

VKB: దోమ మండలం గూడూరు గ్రామంలో గత 15 రోజులుగా నీళ్లు రాక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి రావాల్సిన మంచి నీటి బోరు మోటార్ పడైపోయిందని తెలిపారు. గ్రామస్థులు సర్పంచ్, సెక్రటరీ, వర్డ్ మెంబర్స్‌కు తెలియజేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు త్వరగా సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

February 22, 2026 / 01:37 PM IST

డీసీసీ అధ్యక్షుల సమావేశానికి సిగ్నల్స్ రాక అవస్థలు

VKB: కేంద్రంలోని అనంతగిరి హరిత రిసార్ట్లో DCC అధ్యక్షుల సమావేశం జరుగుతోంది. ఆ ప్రాంతంలో వివిధ కంపెనీల సిగ్నల్స్ రాకపోవడంతో DCC అధ్యక్షుడు ఆందోళన చెందుతున్నారు. అడవి ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో ఎవరికి ఫోన్ చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం DCC అధ్యక్షుల మధ్య గుసగుసలాడుతోంది.

February 22, 2026 / 01:37 PM IST

తెలంగాణ ఉద్యమకారుడికి ఘన నివాళి

SRPT: తిరుమలగిరిలోని 2వ వార్డుకి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, మాజీ వార్డు మెంబర్ పులిగిల్ల యాదగిరి గుండెపోటుతో మరణించడంతో ఆదివారం ఆయన పార్థివదేహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకేపల్లి నరోత్తం రెడ్డి, జయచందర్, యాదగిరి, నరేష్ ఉన్నారు.

February 22, 2026 / 01:35 PM IST

ఆలయానికి పోటెత్తిన భక్తులు

RR: చేవెళ్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అఖండ హారతి జాతర ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. జాతర ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు బారులు తీరడంతో వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో రద్దీగా మారింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

February 22, 2026 / 01:34 PM IST

గ్రేటర్‌కు అత్యంత నాణ్యతతో నీటి సరఫరా

HYD: నగర వాసులకు అత్యంత నాణ్యతతో నీటి సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధమైంది. దీనికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటోమేటిక్ సోలార్ ఎలక్ట్రో క్లోరినేషన్ పద్ధతిని ఉపయోగించనున్నారు. వివిధ నదుల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసిన తర్వాత ఇంటింటికీ సరఫరా చేసేటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీని ద్వారా నాణ్యమైన నీటిని సరఫరా అవుతుందని అధికారులు అన్నారు.

February 22, 2026 / 01:33 PM IST

నూతన రైస్ మిల్లును ప్రారంభించిన మంత్రి సీతక్క

MLG: వెంకటాపూర్ మండలం రామంజాపూర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి నూతనంగా నిర్మించిన రైస్ మిల్‌ను ఇవాళ రాష్ట్ర మంత్రి సీతక్క రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రైస్ మిల్ వ్యాపారంలో రాణించి నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.

February 22, 2026 / 01:32 PM IST

‘పసిబిడ్డ మృతి.. అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలి’

MBNR: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బ్రహ్మోత్సవాలలో భాగంగా దైవదర్శనానికి వెళ్తున్న రజక కుటుంబంపై దాడి చేసి పసిబిడ్డ మృతికి కారణమైన అగ్రవర్ణాలను కఠినంగా శిక్షించాలని పలువురు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయానికి బాధ్యత వహించాలన్నారు.

February 22, 2026 / 01:32 PM IST

జాతరకు వేళాయే….పనులేమో కాకపాయె..!

WGL: గీసుకొండ మండలం శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మార్చి 9 వరకు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 3 నుంచి 7వరకు వరకు జరిగే ప్రధాన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే జాతరకు సమయం దగ్గర పడుతున్నా రూ.1.45 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.

February 22, 2026 / 01:31 PM IST

ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగర్‌లో నూతన SVK ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ హాల్ పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఉపయోగపడే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:30 PM IST

మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి

KMM: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. సత్యనారాయణపురంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఆయన, నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపి, పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.

February 22, 2026 / 01:30 PM IST

రేపు ఎర్రం నాయుడు జయంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు

SKLM: మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 69 వ జయంతి వేడుకలు నిమ్మాడలో సోమవారం నిర్వహించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉ. 10కు నిమ్మాడలోని ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని నివాళులర్పిస్తారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.

February 22, 2026 / 01:30 PM IST