• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మెరుపు సమ్మెకు దిగుతాం: ఆర్టీసీ ఉద్యోగులు

NLR: నెల్లూరులోని ఆర్టీసీ-2 డిపో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఆర్టీసీ-2 డిపోను పినకిల్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ డిపో సెక్రటరీ ప్రసాద్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

February 23, 2026 / 04:21 PM IST

నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడుతా: కవిత

TG: జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జోగులాంబలో రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె.. తన ప్రతి కార్యక్రమాన్ని గద్వాల నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి.. సత్తా చాటుతామన్నారు. ప్రతీ మండలంలో అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు. నడిగడ్డ ప్రజలు నిజాయితీ ప్రజలని చెప్పారు.

February 23, 2026 / 04:21 PM IST

నడిగడ్డ నుంచే కొత్త పార్టీ పెడతా: కవిత

TG: జోగులాంబ గద్వాల నుంచే కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జోగులాంబలో రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆమె.. తన ప్రతి కార్యక్రమాన్ని గద్వాల నుంచే ప్రారంభిస్తానని చెప్పారు. ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి.. సత్తా చాటుతామన్నారు. ప్రతీ మండలంలో అభ్యర్థిని బరిలో దింపుతామన్నారు. నడిగడ్డ ప్రజలు నిజాయితీ ప్రజలని చెప్పారు.

February 23, 2026 / 04:21 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యం’

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణు గోపాలం అన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జనతా వారధి అనే కార్యక్రమాన్ని సోమవారం జిల్లా జడ్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

February 23, 2026 / 04:20 PM IST

పోలీస్ క్రీడాకారులను అభినందించిన సీపీ

PDPL: క్రీడలలో ప్రతిభ సాధించిన పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్- 2026లో పాల్గొని బహుమతులు సాధించిన పోలీసులను సోమవారం కమిషనరేట్లో అభినందించారు. విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడలలో రాణించడం గర్వకారణం అన్నారు.

February 23, 2026 / 04:20 PM IST

విషాదాన్ని నింపిన ట్రైనీ టెకీల బీచ్‌ ఔటింగ్‌

చెన్నైలో జరిగిన బీచ్ ప్రమాదంలో ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రకు చెందిన గోల్డెన్ బీచ్ వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక్కసారిగా 15 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. దీంతో ముగ్గురు కొట్టుకుపోయారు. అయితే, వారిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరొకరు గల్లంతయ్యారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టినట్లు మహారాష్ట్ర సీఎంవో ప్రకటించింది.

February 23, 2026 / 04:20 PM IST

తిరుపతిలో విలువల విద్యా సదస్సు

TPT: పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “విలువల విద్యా సదస్సు”లో ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థుల్లో నైతిక విలువల ప్రాధాన్యంపై ఉపన్యసించారు. జీవితంలో ధర్మం, క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఈవో, అధికారులు హాజరయ్యారు.

February 23, 2026 / 04:19 PM IST

‘రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ’

NRML: రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. అరైవ్ అలైన్ రెండవ దశ కార్యక్రమంలో భాగంగా సోమవారం మామడ మండలంలోని లింగాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు.

February 23, 2026 / 04:19 PM IST

ఆరోగ్యకర జీవనశైలికి పోర్టు పిలుపు

విశాఖ పోర్టు స్టేడియంలో సోమ‌వారం ఫిట్ ఇండియా సైక్లింగ్ డ్రైవ్‌ను ఉత్సాహంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఫిట్‌నెస్ ఉద్యమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో వీపీఏ ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యం, సక్రియ జీవనశైలిపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

February 23, 2026 / 04:18 PM IST

పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఇవాళ దర్శించుకున్నారు. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బొబ్బిలి రోడ్డులో వెలసిన ఈ దేవాలయం ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలన్నారు.

February 23, 2026 / 04:18 PM IST

తమ్మయ్యపేటలో త్రాగునీటి కొరత

AKP: అచ్యుతాపురం మండలం దొప్పర్ల పంచాయతీ తమ్మయ్యపేటలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలోని శ్మశానానికి వెళ్లి చేతి బోరు ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి వస్తుందని, మృతదేహాల దహనం సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని వాపోతున్నారు. అధికారులు తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని వారు కోరుతున్నారు.

February 23, 2026 / 04:18 PM IST

నూతల వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

WGL: గ్రేటర్ WGL మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దామెర్పుల స్వరూప-సాంబయ్య దంపతుల కుమారుడు అనిల్ కుమార్-శ్రావణి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే KR నాగరాజు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులకు బహుమతి అందజేశారు.

February 23, 2026 / 04:17 PM IST

పాదయాత్రకు షాద్ నగర్ న్యాయవాదుల సంఘీభావం

RR: న్యాయవాదులపై దాడులను అరికట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని న్యాయవాదులందరూ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని తెలిపారు.

February 23, 2026 / 04:16 PM IST

తాగునీటి సప్లై‌కు అంతరాయం

NDL: అవుకు పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రాజా వీధిలో భూగర్భ డ్రైనేజీ పనుల కారణంగా పైప్లైన్ ధ్వంసం కావడం వల్ల సంత మార్కెట్, చాకలిపేట, ఆర్టీసీ బస్టాండ్ కాలనీల ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం స్థానికులు అధికారులు ట్యాంకర్ల ద్వారా తక్షణ ప్రత్యామ్నాయ సరఫరా అందించాలని కోరుతున్నారు.

February 23, 2026 / 04:16 PM IST

EdCET పరీక్ష షెడ్యూల్ విడుదల

TG: TG EdCET 2026 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. మే 12న రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో ఎంట్రన్స్ పరీక్ష, మే 30న ఫలితాలు రానున్నాయి.

February 23, 2026 / 04:15 PM IST