• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్

W.G: భీమవరంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మాస్ కాపీయింగ్ జరుగుతుందా అనే కోణాల్లో పట్టణంలోని కళాశాలలో తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, సౌకర్యాల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలించారు.

February 23, 2026 / 05:25 PM IST

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కేంద్ర మంత్రి

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది ప్రజలు కేంద్ర మంత్రికి తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు. వాటిని పరిశీలించి, అవసరమైన వాటిని సత్వరమే పరిష్కరించారు.

February 23, 2026 / 05:23 PM IST

‘ఆ ప్రధానోపాధ్యాయున్ని సస్పెండ్ చేయాలి’

KRNL: కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యాన్ని పక్కదారి పట్టించిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని AISF నాయకులు ఇవాళ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

February 23, 2026 / 05:23 PM IST

గుంకలాం లేఔటులో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

VZM: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంకలాం లేఔటులో “కార్డన్ అండ్ సెర్చ్” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇంఛార్జ్ డీఎస్పీ ఆర్. గోవిందరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బంది ఒకేసారి ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. రికార్డులు సక్రమంగా లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, 8 మందిని అరెస్ట్ చేశారు.

February 23, 2026 / 05:23 PM IST

బాధితులకు సత్వర న్యాయం చేయాలి: ఎస్పీ

JGL: గ్రీవెన్స్ డే సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

February 23, 2026 / 05:22 PM IST

రైతులకు పంటల సాగు పై అవగాహన

MDK: తూప్రాన్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం, ప్రస్తుతం వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన చేపట్టారు. పంటలలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రతాప్ రెడ్డి వివరించారు. నేలలో సేంద్రియ కర్బనం ప్రాముఖ్యత గురించి, దానిని ఎలా పెంచుకోవాలో తెలిపారు.

February 23, 2026 / 05:22 PM IST

KDP: ఏసీబీ దాడిలో పట్టుబడిన అధికారులు

KDP: పులివెందులలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ దాడి నిర్వహించింది. లంచం తీసుకుంటున్న సమయంలో రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్సై అనిల్ కుమార్‌లను అధికారులు పట్టుకున్నారు. లంచం సొమ్మును సీజ్ చేసి, కేసుపై విచారణ కొనసాగుతోంది.చైన్ స్నాచింగ్ కేసు దర్యాప్తులో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 05:20 PM IST

‘పసికందును చంపిన దోషులను శిక్షించాలి’

WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో కులం పేరుతో రజాక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని BSP జిల్లా అధ్యక్షుడు బస్కే నాగరాజు ఖండించారు. సోమవారం సాయంత్రం నర్సంపేటలో BSP నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో చనిపోయిన పసికందుకు నివాళులర్పించారు. నాగరాజు మాట్లాడుతూ.. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని హత్య చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:20 PM IST

ఫార్మర్ ఐడీపై ఏఈవో సూచనలు

MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని పోల్కంపల్లి ఏఈవో శివ తెలిపారు. రైతులు ఆధార్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫార్మర్ రిజిస్ట్రీ స్థితిని పరిశీలించుకోవచ్చన్నారు. లింక్‌లో ‘Approved’ లేదా ‘Pending’గా చూపితే నమోదు పూర్తైనట్లేనని స్పష్టం చేశారు. ప్రయోజనాల కోసం వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 05:20 PM IST

శివాజీ విగ్రహ ఏర్పాటును నిలివేయాలని ఆదేశాలు

KMR: లింగంపేట మండలం ముస్తాపూర్ పరిధిలో కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిలో నోటీసులు అందజేసినప్పటికీ శివాజీ విగ్రహం ఏర్పాటు చేపట్టడంతో లింగంపేట ఎమ్మార్వో కార్యాలయానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైందవ సమాజాన్ని మేల్కొలిపిన శివాజీ విగ్రహ ఆవిష్కరణను ఆపివేయించడం తగదని పలు సంఘాలు మండిపడుతున్నాయి.

February 23, 2026 / 05:19 PM IST

‘చదువు మన తలరాతను మారుస్తుంది’

HNK: చదువు మన తలరాతను మారుస్తుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ మర్కజి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా బాలవికాస సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు.

February 23, 2026 / 05:16 PM IST

ప్రజల సమస్యల చట్టపర పరిష్కారానికి తక్షణ కృషి..!

SRPT: పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో, ఫిర్యాదు దారులతో ఎస్పీ నరసింహ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

February 23, 2026 / 05:16 PM IST

తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన

ELR: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి, వినతిపత్రం అందించారు. రైతులకు అన్నదాత సుఖీభవ గత ఏడాది బకాయిలు చెల్లించాలని, రైతులకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.

February 23, 2026 / 05:15 PM IST

NDL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

NDL: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 25 వ తేదీన జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగం మేల నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. ప్రముఖ కంపెనీల నుంచి సుమారు 550 పోస్టుల భర్తీకి ఈ మేలా జరుగుతుందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫైనల్ ఇయర్ చదువుతున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

February 23, 2026 / 05:15 PM IST

ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్‌ఎస్ విక్రాంత్

విశాఖలోని ‘మిలాన్–2026’, ‘ఐఎఫ్ఆర్’ వేడుకల సందర్భంగా భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ వికాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్‌తో పాటు పలు స్నేహ దేశాలకు చెందిన 80 మందికి పైగా మీడియా ప్రతినిధులు నౌకను సందర్శించారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన విధానాన్ని ఈస్ట‌ర్న్ నేవ‌ల్ అధికారులు నౌక ప్ర‌త్యేక‌త‌ల‌ను జ‌ర్న‌లిస...

February 23, 2026 / 05:14 PM IST